NTV Telugu Site icon

ఐసీయూలో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ భరోసా

Jr NTR video call to his Seriously Sick fan

ఐసీయూలో ఉన్న అభిమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ భరోసా ఇచ్చారు. రెండు వారాల క్రితం మురళి అనే వ్యక్తి తూర్పు గోదావరి జిల్లా రజోల్‌లో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతని రెండు మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మురళి జూనియర్ ఎన్టీఆర్‌ను కలవాలనే కోరికను వ్యక్తం చేశారు. మురళి కోరిక విన్న తూర్పు గోదావరి ఎన్టీఆర్ అభిమానుల సంఘం తారక్ ను సంప్రదించి వీడియో కాల్ ద్వారా మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ఈ వార్త విన్న జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా మురళితో మాట్లాడి ఆయన వైద్యం గురించిన సమాచారాన్ని, అతని ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. అతనికి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. మురళి త్వరగా కోలుకోవాలని ఆశించారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిమానితో ఎన్టీఆర్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : అఫిషియల్ : “ప్రభాస్ 25” టైటిల్ అనౌన్స్మెంట్