NTV Telugu Site icon

బాలీవుడ్ భామ‌ల తెలుగు సినిమా రెమ్యూన‌రేష‌న్ ఎంత‌!?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొణే, అలియా భ‌ట్ తొలిసారి తెలుగు సినిమాల్లో న‌టిస్తున్నారు. ఈ రెండూ పాన్ ఇండియా మూవీస్ కావ‌డ‌మే వాళ్ళ ఎంపిక‌కు కార‌ణం. బాలీవుడ్ లో టాప్ పొజిష‌న్ లో ఉన్న వీళ్ళు స‌ద‌ర‌న్ మూవీకి ఎంత రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నారో అనే ఆస‌క్తి స‌హ‌జంగా ఎవ‌రిలో అయినా ఉంటుంది. దాంతో ఆ దిశ‌గా ఆరా తీస్తే… ఆస‌క్తిక‌ర‌మైన స‌మాచార‌మే ల‌భ్య‌మైంది. అలియా భ‌ట్ కు సౌత్ లో సూప‌ర్ డిమాండ్ ఉంది. ఎంతోమంది ఆమె డేట్స్ కోసం అప్రోచ్ అయినా సున్నితంగా తిర‌స్క‌రిస్తూ వ‌చ్చింది. అయితే రాజ‌మౌళి బాహుబ‌లి చూసిన త‌ర్వాత ఆమె మ‌న‌సు మారింది. రాజ‌మౌళి తాజా చిత్రం ట్రిపుల్ ఆర్ కోసం అలియాను అప్రోచ్ కాగానే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఈ సినిమా కోసం అలియా తొలుత భారీ మొత్తాన్నే డిమాండ్ చేసింద‌ట‌. అయితే ప‌లు సంప్ర‌దింపుల త‌ర్వాత రోజుకు యాభై ల‌క్ష‌ల రెమ్యూన‌రేష‌న్ కు అంగీక‌రించ‌ద‌ని తెలుస్తోంది. ఆమె షూటింగ్ డేస్ మొత్తం 10 నుండి 12 రోజులు అని అంటున్నారు. ఆ ర‌కంగా ఆమెకు ఐదు కోట్లు, ఆమె ప‌ర్శ‌న‌ల్ స్టాఫ్ కు షూటింగ్ జ‌రిగినంత కాలం రోజుకు ల‌క్ష చొప్పున ఫిక్స్ చేశార‌ట‌. దీనికి ట్రావెల్ అండ్ హోట‌ల్ మ‌కాం ఛార్జీలు అద‌నం. ఆ ర‌కంగా అలియా భ‌ట్ కోసం ఆరేడు కోట్లు ఖ‌ర్చు క‌ట్టిపెట్టినా… ఈ సినిమా హిందీ వ‌ర్ష‌న్ కు ఆమె ప్రెజెన్స్ ఎంతో హెల్ప్ అవుతుంద‌ని రాజ‌మౌళి భావిస్తున్నార‌ట‌. అలానే ఇందులో మ‌రో కీల‌క పాత్ర పోషిస్తున్న‌ బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్ గ‌న్ కూ భారీ మొత్త‌మే ముట్టచెప్పార‌ట‌.
ఇక ప్ర‌భాస్ తో నాగ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న పాన్ ఇండియా సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీలో మ‌రో బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్ అమితాబ్ బ‌చ్చ‌న్ సైతం న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత అశ్వినీద‌త్ నిర్మిస్తున్న ఈ మూవీ కోసం దీపిక ప‌దుకునే సైతం భారీ మొత్తమే డిమాండ్ చేసింద‌ట‌. ఆమెకు ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయ‌ల రెమ్యూన‌రేష‌న్ ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. చిత్రం ఏమంటే… గ‌తంలోనే దీపికా ప‌దుకునే ఓ తెలుగు సినిమాలో స్పెష‌ల్ సాంగ్ లో న‌ర్తించింది. జ‌యంత్ సి ప‌రాన్జీ తెర‌కెక్కించిన ల‌వ్ 4 ఎవ‌ర్లో ఆమె న‌టించింది. అయితే ఆ సినిమా విడుద‌ల‌కు నోచుకోలేదు. మ‌రి ఈ ఇద్ద‌రు భామ‌ల‌కు ఇస్తున్న పారితోషికానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం నిర్మాత‌ల‌కు దక్కుతుందో లేదో చూడాలి.