NTV Telugu Site icon

Hanuman Team: సీఏం యోగిని కలిసిన హనుమాన్ టీమ్.. ఎందుకో తెలుసా?

Hunuman

Hunuman

భారత దేశ ప్రజలు 500 ఏళ్ల కల నేరవేరింది.. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట వైభవంగా జరిగింది.. జై శ్రీరామ్ నామం నలుదిక్కులు వినిపించేలా గట్టిగా మారుమోగింది. థియేటర్లలోనూ జై శ్రీరామ్… జై హనుమాన్ నామస్మరణ బలంగా వినపడింది.. హనుమాన్ సినిమా ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంది.. ఈ చిత్ర టీమ్ యూపీ సీఏం యోగిని కలిశారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఈ సినిమా విజయం సాధించడంతో హీరో తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మను యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. యువ ప్రేక్షకులపై ఈ సినిమా ఎటువంటి ప్రభావం చూపించిందనేది ముఖ్యమంత్రికి దర్శకుడు వివరించారు. అంతే కాకుండా భారతీయ పురాణ ఇతిహాసాల గురించి గొప్పగా సినిమాలో చూపించినట్లు వివరించారు.. ఈ మీటింగ్ అనంతరం.. డైరెక్టర్ మాట్లాడుతూ.. యోగి ఆదిత్యనాథ్ గారిని కలవడం నిజంగా మాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాం.

నాకు ఇన్స్ఫైరింగ్ మూమెంట్ ఇది. సినిమాల ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను ఎలా కాపాడుకోవచ్చనేది యోగి గారు మాతో చర్చించారు. ‘హనుమాన్’ సినిమాలో మేం చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. ఆధ్యాత్మికతను ఇలా అర్థం చేసుకొనే ముఖ్యమంత్రి ఉండటం గ్రేట్ అన్ని చెప్పారు.. ఇటువంటి ప్రోత్సాహాలు మేం మరిన్ని కొత్త ప్రయోగాలు చేయడానికి మనకు స్ఫూర్తి ఇస్తుంది” అని చెప్పారు.. ఆ తర్వాత హీరో తేజా కూడా మాట్లాడారు.. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ ను ప్రకటించబోతున్నారని సమాచారం..