కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇవాళ యూనివర్సల్ స్టార్. తమిళం, హిందీ, ఆంగ్ల చిత్రాలలో నటిస్తున్నాడు. విశేషం ఏమంటే ధనుష్ త్వరలో టాలీవుడ్ లోకీ అడుగుపెట్టబోతున్నాడు. అంతేకాదు.. రుస్సో బ్రదర్స్ నెట్ ఫ్లిక్స్ మూవీ ‘ది గ్రే మ్యాన్’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ యు. ఎస్.లో జరుగుతోంది. ఇదిలా ఉంటే… ధనుష్ ఈ యేడాది ఫిబ్రవరిలో తన సొంతిల్లుకు భూమి పూజ చేశాడు. చెన్నయ్ లో ధనుష్ మామ, సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసం ఉండే పోయిస్ గార్డెన్ లోనే ఈ యంగ్ హీరో కూడా ఇల్లు కట్టిస్తున్నాడు. రజనీకాంత్ ఈ భవంతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. దాదాపు 19 వేల చదరపు అడుగుల స్థలంలో నాలుగు అంతస్తుల విల్లాను ధనుష్ నిర్మించబోతున్నాడట. ఎంత లేదన్నా… ఈ భవన నిర్మాణానికి 150 కోట్ల రూపాయలను ధనుష్ ఖర్చు చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరో విశేషం ఏమంటే… సర్వ సౌకర్యాలతో భవంతిని నిర్మించాలని కోరుకుంటున్న ధనుష్ దానికి తగ్గట్టుగానే భారీ రెమ్యూనరేషన్స్ ను ఆశిస్తున్నాడట. ఆ రకంగా శేఖర్ కమ్ముల సినిమాకు ధనుష్ ఏకంగా రూ. 30 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ధనుష్ సొంత విల్లా కోసం వెచ్చిస్తోంది ఎంతో తెలుసా!?
