కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇవాళ యూనివర్సల్ స్టార్. తమిళం, హిందీ, ఆంగ్ల చిత్రాలలో నటిస్తున్నాడు. విశేషం ఏమంటే ధనుష్ త్వరలో టాలీవుడ్ లోకీ అడుగుపెట్టబోతున్నాడు. అంతేకాదు.. రుస్సో బ్రదర్స్ నెట్ ఫ్లిక్స్ మూవీ ‘ది గ్రే మ్యాన్’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ యు. ఎస్.లో జరుగుతోంది. ఇదిలా ఉంటే… ధనుష్ ఈ యేడాది ఫిబ్రవరిలో తన సొంతిల్లుకు భూమి పూజ చేశాడు. చెన్నయ్ లో ధనుష్ మామ, సూపర్ స్టార్…