దేశం సాంకేతికంగా పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. డిటిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా వరకు క్యాష్ ను క్యారీ చేయడం లేదు. ఏది కావాలన్నా ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కొనుగోలు చేస్తున్నారు. దీంతో వీధిలో ఉండే బెగ్గర్లు అవస్థలు పడుతున్నారు. ఎవర్ని అడిగినా డబ్బులు లేవని చెబుతుండటంతో వారు కూడా టెక్నాలజీకి అప్‌గ్రేడ్ అవుతున్నారు. పేటీఎం, ఫోన్‌పే తదితర డిజిటల్ పేమెంట్ బోర్డులను మెడలో వేసుకొని తిరుగుతున్నారు. ఎవరైనా చిల్లర లేదని అంటే మెడలోని డిజిటల్ పేమెంట్ బోర్డులు చూపి పేమెంట్ చేయమని అంటున్నారు. బీహార్‌లోని బేటయ్య ప్రాంతంలో భిక్షాటన చేసే భిక్షగాడు తన మెడలో క్యూఆర్ కోడ్‌లతో కూడిన బోర్డులు వేసుకొని కనిపించాడు. దీంతో భిక్షగాడు రాజూప్రసాద్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
Read: ఎయిర్ ఇండియాకు ఆ పేరు ఎలా వచ్చిందంటే..?