ఎంటర్టైన్మెంట్ అంటే పెద్ద తెర లేదంటే బుల్లితెర! నిన్న మొన్నటి వరకూ ఇంతే… కానీ, ఇప్పుడు సీన్ మారింది. కరోనా గందరగోళానికి ముందే ఓటీటీ హంగామా మొదలైంది. కానీ, పోయిన సంవత్సరం లాక్ డౌన్ తో డిజిటల్ స్ట్రీమింగ్ వేగం పుంజుకుంది. ఇక ఈ సంవత్సరం కూడా వైరస్ విజృంభిస్తుండటంతో స్టార్ హీరోల సినిమాలే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పైకి వచ్చేస్తున్నాయి. అయితే, సినిమాల సంగతి ఎలా ఉన్నా ఓటీటీల వల్ల వెబ్ సిరీస్ లు, యాంథాలజీలు వంటి న్యూ ఫార్మాట్ కంటెంట్ కి క్రమంగా క్రేజ్ పెరుగుతోంది. తమిళంలో అయితే తెలుగులో కంటే మరింత ఎక్కువే హడావిడి ఉంది!
ఇప్పటికే తమిళంలో కాజల్, తమన్నా లాంటి పాప్యులర్ స్టార్స్ వెబ్ సిరీస్ లతో ఆకట్టుకున్నారు. అయితే, నార్మల్ సిరీస్ లు కాకుండా యాంథాలజీ పేరుతో ముగ్గురు, నలుగురు దర్శకులు ఒకేచోట చేరి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయటం కోలీవుడ్ లో న్యూ క్రేజ్ గా మారింది. ఇప్పటికే, ‘పుతమ్ పుతు కాలై, పావకదైగళ్, సిల్లు కరుప్పాటి, కేర్ ఆఫ్ కాదల్’ వంటి యాంథాలజీలు జనంలోకి వచ్చాయి. వాట్ని తమిళ ప్రేక్షకులు బాగానే ఆదరించారు కూడా…
ఇక రాబోయే యాంథాలజీస్ లో మణిరత్నం నిర్మిస్తోన్న ‘నవరస’ చాలా మందిని ఆకర్షిస్తోంది. తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది కథలు చెబుతుండటంతో తమిళ స్టార్స్ కూడా స్మార్ట్ స్క్రీన్స్ పై… చాలా మందే కనిపించబోతున్నారు! అయితే, నెట్ ఫ్లిక్స్ పై అందుబాటులోకి రానున్న మణిరత్నం ‘నవరస’తో పాటూ ‘విక్టిమ్’ అనే మరో యాంథాలజీ సోనీ లివ్ పై స్ట్రీమింగ్ కానుంది. చింబుదేవన్, రాజేశ్ ఎం., పా రంజిత్, వెంకట్ ప్రభు ఇందులోని వివిధ సెగ్మెంట్స్ ను డైరెక్ట్ చేశారట. సోనీ లివ్ పై ‘విక్టిమ్’ యాంథాలజీ స్ట్రీమింగ్ అవుతుందని, రిలీజ్ డేట్ ఫలానా అనీ, ఇంకా అధికారిక సమాచారం లేదు. త్వరలోనే వివరాలు వెలవడవచ్చు