కావాల్సినంత అందం ఉన్నా ఎందుకో ఇంకా వెనుకబడిపోతోంది ప్రగ్యా జైస్వాల్. ‘కంచె’ బ్యూటీ టాలీవుడ్ టూ బాలీవుడ్ అన్ని చోట్లా అదృష్టం పరీక్షించుకుంటోంది. అయినా ఎక్కడా ఇంకా స్టార్ డమ్ రాలేదు. అయితే, నెక్ట్స్ ‘అఖండ’ సినిమాలో బాలయ్యతో కనిపించనున్న అందాల సుందరి ముద్దుముచ్చట్ల గురించి మాట్లాడింది! అఫ్ కోర్స్, తెర మీద కాదులెండీ… రియల్ లైఫ్ లిప్ లాక్ గురించి ప్రగ్యా ఆసక్తికరంగా స్పందించింది…
Read Also:ట్రైలర్ : అదరగొట్టేసిన “నారప్ప”
పెద్ద తెరపై పెద్దగా స్కిన్ షో ఎప్పుడూ చేయలేదు ప్రగ్యా జైస్వాల్. అయితే, నిజ జీవితంలో డేటింగ్ సంగతి గురించి వస్తే… ఓ ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ రెస్పాన్స్ అందించింది! తాను డేటింగ్ చేస్తే ఫస్ట్ డేనే కిస్ చేయలేనని అంటోంది. ముందు మనసులు కలవాలని అప్పుడే పెదాలు కలుపుతానని చెబుతోంది! తన పార్టనర్ తో ఫుల్ కంఫర్టబుల్ అవ్వకుండానే లిప్ లాక్ చేసే రకం తాను కాదంటోంది ప్రగ్యా!
“నేను అంత ఈజీగా ముద్దు ఇవ్వ’’నని చెప్పకనే చెప్పిన ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎవ్వరితోనూ డేటింగ్ చేస్తున్నట్టు టాక్ అయితే లేదు. చూడాలి మరి, సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారేమో! ఎందుకంటే, త్వరలో బాలి ద్వీపానికి వెళ్లి అక్కడి బీచుల్లో రిలాక్స్ అయ్యి వస్తానంటోంది… వయ్యారి భామ!