ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అశ్లీల చిత్రాల కేసులో ముంబై పోలీసులు నిన్న (సోమవారం) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కుంద్రాతో పాటు ఇప్పటి వరకు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా రాజ్ కుంద్రా అరెస్ట్ వార్త ఒక్కసారిగా బాలీవుడ్ లో సంచలనమైంది. పోలీసుల విచారణలో రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ విషయమై విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పోర్న్ చిత్రాల కేసులో కుంద్రానే కీలక సూత్రధారి అని, ఈ విషయంలో తమ దగ్గర బోలడన్ని ఆధారాలు ఉన్నట్లు ముంబై పోలీసు కమీషనర్ తెలిపారు. ఔత్సాహిక నటీనటులతో అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్ చేస్తున్నట్లు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. రాజ్ కుంద్రా 2009లో శిల్పాశెట్టిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అశ్లీల చిత్రాల కేసు: శిల్పా శెట్టి భర్తను విచారిస్తున్న పోలీసులు
