షర్మిల వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. షర్మిల వ్యాఖ్యలు సరికాదన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేయడం తమకు గర్వకారణం.. ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీని ఎదిరించిన ధీశాలి జగన్ అని పేర్కొన్నారు. తెలంగాణ నా మెట్టునిల్లు అని చెప్పిన షర్మిల.. చివరకు అక్కడ చాప చుట్టి ఏపీకి వచ్చారని ఆరోపించారు. షర్మిల వెనుక ఏ ఒక్క రాజశేఖరరెడ్డి అనుచరులు రాలేదు.. అంతా జగన్ వెనుక నడిచారని భూమన తెలిపారు. చివరకు కాంగ్రెస్‌లోనూ మీకు మద్దతు లేదని విమర్శించారు. ఇవాళ అన్ని విధాలా షర్మిల ఒంటరి అయ్యారు.. షర్మిల లాంటి చెల్లి జగన్‌కు ఉండడం చాలా బాధాకరమని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డిని ప్రజల గుండెల నుంచి తుడిచేయాలని భావించే టీడీపీతో షర్మిల కుమ్మక్కు అవడం దారుణమని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
Read Also: Mann Ki Baat – PM Modi: ‘డిజిటల్ అరెస్ట్’లపై మోడీ ఆందోళన.. ప్రజలకు కీలక సూచనలు..
జగన్‌ను సర్వ నాశనం చేయాలని షర్మిల ఇలా చేస్తున్నారు.. హామీలు అమలు చేయలేక టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని భూమన ఆరోపించారు. నెలకో అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు.. ఈ నెల షర్మిల అంశాన్ని తెచ్చారని అన్నారు. ఇంత జరుగుతుంటే షర్మిలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అక్క, చెల్లి, తమ్ముళ్లకు ఎన్ని ఆస్తులు పంచాడో చంద్రబాబు చెప్పాలని అన్నారు. మరోవైపు.. 164 సీట్లు వచ్చినా కూటమి సంతోషంగా పాలించలేక పోతోందని ఆరోపించారు.
Read Also: Amit Shah: బంగ్లాదేశ్ చొరబాట్లు ఆగినప్పుడే బెంగాల్‌లో శాంతి..
ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్న వ్యక్తి జగన్.. జగన్ అంటే వీరికి భయం అని భూమన తెలిపారు. పెళ్ళై ఇన్నేళ్ళ తర్వాత ఆస్తుల పంపకంకు పూర్తి సహకారం అందిస్తున్న వైఎస్ భారతిని అభినందించాలి.. ఓడినా కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వ్యక్తి జగన్ అని అన్నారు. ఆస్తుల పంపకం కుటుంబ వ్యవహారం.. అయినా చంద్రబాబు రాజకీయ అవసరాలకు షర్మిలను వాడుకుంటున్నారని తెలిపారు. షర్మిల టీడీపీలో చేరుతారో లేక కాంగ్రెస్ నుండే ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతారో తెలియదని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.