Y.S. Sharmila: ఖమ్మం జిల్లాలో YSRTP పార్టీ కార్యాలయం భూమి పూజను వైస్ షర్మిల నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మీ బంధువైతా.. మీ బిడ్డనైతా.. పులి కడుపున పూలే పుడుతుంద అన్నారు. రాజన్న లాగే దేనికీ భయపడను నన్ను ఆశీర్వదించండి అని అన్నారు షర్మిల. రాజశేఖర్ రెడ్డి తెచ్చిన సంక్షేమ పథకాలు చరిత్రలో ఏ నాయకుడైన చేశాడా? అని ప్రశ్నించారు. 20 నిమిషాలకి 108 వచ్చేలా చేసింది వై ఎస్ కదా? పోడు భూములకు పట్టాలు ఇచ్చింది వై యస్ కదా? పాలేరు రిజర్వాయర్ ను అభివృద్ధి చేసింది వైస్ కదా? పాలేరు లో 20 వేల మందికి ఇల్లులు ఇచ్చింది నిజం కాదా? రాజన్న పాలన పాలేరు నుంచే ప్రారంభమన్నారు. పాలేరు నుంచే పోటీ చేస్తా అని తెలిపారు. పాలేరు మట్టిలో ప్రజల ఆశయాలు, ఆశలు, చెమట, శ్రమ, రక్తం, బలం సాక్షిగా మాట ఇస్తున్న నేటి నుంచి పాలేరు బిడ్డను అని తెలిపారు షర్మిల. మాట తప్పని, మడమ తిప్పని బిడ్డగా మాట ఇస్తున్న నా పోరాటం మీకోసమే అన్నారు.
Read also: ED Notice: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు
ఖమ్మంలో భూమిపూజ కార్యక్రమంలో వైస్ విజయమ్మ మాట్లాడుతూ..శర్మిలమ్మ విజయంలో మొదటి అడుగు పడిందని అన్నారు. ప్రజలకోసమే పాటు పడే కుటుంబం వైస్ కుటుంబం అన్నారు. చిత్తశుద్ధితో రాజన్న రాజ్యం కోసం శర్మిలమ్మ వచ్చింది ఆశీర్వదించండని కోరారు. తెలంగాణలో షర్మిలకు రక్షణ లేదని ఓ ఆడబిడ్డ ను బంధించారని ఆరోపించారు. తెలంగాణ మార్పు కై పునాది రాయి పడిందని పేర్కొన్నారు. ఇక నుంచి శర్మిలమ్మ ఇల్లు పాలేరు అని అన్నారు. తెలంగాణ ను పాలించేది ఇక నుంచి పాలేరు అంటూ తెలిపారు. తెలంగాణ బిడ్డ కాదని విమర్శించిన వారందరికీ ఈ పునాది రాయే జవాబు అన్నారు. రాజన్న ఆశయాలకు పునాది పడిందని సగర్వాంగా చెప్తున్న అని తెలిపారు. రాజన్నకు పులివెందుల ఎలానో షర్మిళ కు పాలేరు అలాగా అన్నారు విజయమ్మ. ఖమ్మం గడ్డకు షర్మిలకు అవినాభావ సంబంధం ఉందని, 2004,2009 లో రాజన్న ఆశీర్వదించనట్టుగానే శర్మిలమ్మను ఆశీర్వదించండన్నారు. ఆడది ఎం చేస్తది అన్న వారికి చెప్తున్న ఆడబిడ్డ కాదు ఆడ బెబ్బులి అంటూ తెలిపారు. ఈ నాయకుల మధ్య నిలబడడం కష్టమే అయిన నిలబడ్డది అంటే ఎంత ధైర్యమో ఆలోచించండి అంటూ తెలిపారు.
Komatireddy Venkat Reddy: మోడీతో చాలా మాట్లాడా.. అవి ఏంటో చెప్పలేను