Site icon NTV Telugu

YSRTP Sharmila Kodangal Tour: నేడు రేవంత్‌ రెడ్డి ఇలాకాలో షర్మిల ప్రజా ప్రస్థాన పాద యాత్ర

Ysrtp Sharmila Kodangal Tour

Ysrtp Sharmila Kodangal Tour

YSRTP Sharmila Kodangal Tour: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో వైస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థాన పాద యాత్ర మొదలు కానుంది. నియోజకవర్గం లో ఐదు రోజులు నిర్వహించనున్న పాద యాత్ర కొనసాగునుంది. ఈ సందర్బంగా నియోజకవర్గంలో వైస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్తాన యాత్ర పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొండగల్‌, మల్కాజ్‌ గిరి అంటేనే రేవంత్‌ రెడ్డి ఇలాకాగా పేరుగాంచింది. అయితే నేడు వైఎస్‌ షర్మిల కొండగల్‌ లో పర్యటించడం పై సర్వత్రా ఉత్కంఠత నెలకోవడంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంగటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.

పర్యటన వివరాలు:

ఆగస్టు 9: కొడంగల్ నియోజకవర్గ కేంద్రం బండ ఎల్లమ్మ దేవాలయం నుండి ప్రారంభం మరియు అంబేద్కర్ కూడలి లో బహిరంగ సభ

ఆగస్టు 10: పెద్ద నందిగామ క్రాస్ రోడ్డు నుండి ప్రారంభ మై పర్సా పూర్, హస్నాబాద్ మీదుగా, కొత్తగా ఏర్పడ్డ దుద్యాల మండలం లోని దుద్యాల, మరియు లగచర్ల గ్రామ స్టేజి వరకు పాదయాత్ర కొనసాగింపు…..

ఆగస్టు 11: దుద్యాల మండలం, హకీమ్ పేట్ నుండి ప్రారంభ మై పోలేపల్లి స్టేజి,కోస్గి మండలం లోని సర్జఖాన్ పేట్, కోస్గి, చెన్నారం గ్రామాల మీదుగా యాత్ర కొన సాగి, ముక్తి పాడు చేరిక, వైస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులు…

ఆగస్టు 12: కోస్గి మండలం ముశ్రీఫా లో తిరిగి యాత్ర ప్రారంభమై దౌల్తాబాద్ మండలం లోని సూరాయి పల్లి, బోల్వోని పల్లి, బంటోని బావులు, చల్లాపూర్ వరకు కొనసాగి..ఈర్లపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన వైస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించ నున్న షర్మిల. అనంతరం ఊరకుంటా, దౌల్తాబాద్ వరకు యాత్ర కొనసాగింపు….

ఆగస్టు 13: తిరిగి దౌల్తాబాద్ మండలం లో యాత్ర ప్రారంభ మై పోచమ్మ గడ్డ, ర్యాలకుంట, రామన్న కుంట తండా, తిమ్మారెడ్డి పల్లి క్రాస్ రోడ్డు, గోక ఫస్లా బాద్, పోల్కం పల్లి క్రాస్ నంద్యా నాయక్ క్రాస్ రోడ్డు మీదుగా దేవరఫస్ల బాద్ వరకు కొనసాగి…

ముగింపు: మద్దూర్ మండలం లోని దమగన్ పూర్ లో మాట ముచ్చట్ల తో… నాగిరెడ్డి పల్లి లో ప్రజా ప్రస్థాన యాత్ర ముగియనుంది.

కాగా గత కొద్ది రోజుల క్రితం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి మర్యాద పూర్వకంగా వైస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను కలువడం చర్చనీయాంశంగా మారింది.
COVID 19: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

Exit mobile version