YS Vijayamma Consoles Krishnam raju Wife: కృష్ణంరాజు భార్యకు విజయమ్మ పరామర్శ మాజీ కేంద్రమంత్రి, రెబల్స్టార్ కృష్ణంరాజుకు వైఎస్ విజయమ్మ నివాళులర్పించారు. జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికెళ్లి సతీమణి శ్యామల, కూతుళ్లతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు, దివంగత సీఎం వైఎస్సార్ మధ్య అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరనే వార్త అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 11వ తేదీన తెల్లవారుజామున 3:25 గంటలకు కృష్ణం రాజు కన్నుమూశారు. ఈ వార్త విన్న చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
Subbulakshmi Jagadeesan: సీఎం స్టాలిన్‌కు షాక్.. పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత