YS Sharmila: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్టీపీని స్థాపించి ప్రభావం చూపలేకపోయిన మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో అన్ని విషయాలపై చర్చించిన షర్మిల..ఈరోజు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్‌ఆర్‌టీపీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు నేతలకు స్పష్టం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే ఏపీలో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నాయకత్వం చెబుతోందని అన్నారు. ఎపి సిఎంగా ఉంటే పార్టీకి లాభం చేకూరుతుందని భావిస్తున్నామని, ఏఐసిసిలో పదవి ఇస్తే రెండు రాష్ట్రాల్లో ప్రచారం చేసుకోవచ్చని నేతలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత వైఎస్ షర్మిలపై ఉందన్నారు. అనంతరం కీలక ప్రకటన చేసేందుకు ఇవాళ వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపుల పాయకు షర్మిల వెళ్లనున్నారు. అయితే షర్మిలకు ఏపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారా లేక ఏఐసీసీ పదవి ఇస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
Read also: Kalyan Ram: రెండు సినిమాలు అనౌన్స్ చేసావ్ బ్రో? ఏది ముందు స్టార్ట్?
కాంగ్రెస్ లో చేరిన తర్వాత వైఎస్ షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు రాహుల్ గాంధీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏఐసీసీ, సీడబ్ల్యూసీలో ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై ఉత్కంఠకు తెరపడింది. అంతా సవ్యంగా సాగితే ఈరోజు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జరిగే వైఎస్‌ఆర్‌టీపీ సభ చివరిది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక ఈ నెల 4న ఖరారైంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు జాతీయ మీడియాతో ధృవీకరించాయి. రేపు సాయంత్రం ఢిల్లీకి ముఖ్య నేతలతో కలిసి బయలుదేరుతారని తెలిపారు. ఈ నెల 4న ఎల్లుండి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు విశ్వనీయ సమాచారం. ఆ తర్వాత కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి షర్మిలకు కూడా 4వ తేదీన ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానం అందింది.
Read also: Traffic e Challan: చూసుకుని కట్టండి బ్రో.. ట్రాఫిక్ ఈ చలాన్ పేమెంట్స్ ఫేక్ వెబ్సైట్..!
అయితే.. ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలను కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఢిల్లీకి పిలిపించి షర్మిల చేరిక, పార్టీ బాధ్యతలు అప్పగించడం, సార్వత్రిక ఎన్నికలపై విస్తృతంగా చర్చించారు. షర్మిల చేరికపై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్‌గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తమతో చర్చించినట్లు ఎపిపిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జెడి శీలం మీడియాకు వెల్లడించారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఘర్వాప్సీ నినాదంతో కాంగ్రెస్ సీనియర్లను కూడా తిరిగి పార్టీలోకి తీసుకురాబోతున్నట్లు రుద్రరాజు తెలిపారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోనూ చర్చిస్తున్నామని, పలువురు సీనియర్లు కూడా మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన చెప్పడం గమనార్హం.
HUL GST Notice: హిందుస్థాన్ యూనిలీవర్‌కు జీఎస్టీ శాఖ రూ.447 కోట్ల నోటీసు
