Site icon NTV Telugu

Ys Sharmila: బంగారు తెలంగాణ కాదు.. బాధల తెలంగాణ

Ysrtp

Ysrtp

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఇది బంగారు తెలంగాణ కాదు…బాధల తెలంగాణ అంటూ కేసీఆర్ పాలనపై ఆమె నిప్పులు చెరిగారు. బార్లు – బీర్లు – ఆత్మహత్యల తెలంగాణ గా మారింది రాష్ట్రం. ఉద్యమం చేసిండని కేసిఆర్ ను 2సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఈ ప్రజలకు ఆయన చేసిందేమిటి?

https://ntvtelugu.com/anchor-anasuya-fires-on-netizen/

ఎన్నికలప్పుడు గారడీ మాటలు తప్ప కేసిఆర్ తెలంగాణను ఉద్దరించేది ఏమిటి? మళ్ళీ కేసిఆర్ మాటలకు మోసపోవద్దని హితవు పలికారు వైఎస్ షర్మిల. ప్రజలేసిన ఓట్లతో గెలిచి అధికారపార్టీకి పోయిన ఎమ్మెల్యేలను ఏమనాలి… ఇది రాజకీయ వ్యభిచారం కాదా? అన్నారు. తెలంగాణలో ప్రభుత్వానికి ప్రశ్నించే ప్రతిపక్షాలున్నాయా? అసలు అని ఆమె అన్నారు.

మాటిస్తే మడమ తిప్పని వైఎస్సార్ బిడ్డగా చెప్తున్నా…. మళ్లీ రాజన్న రాజ్యం తెస్తానన్నారు. కాకరవాయి సభలొ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలో యాత్ర ప్రవేశించింది. పాలేరు నియోజకవర్గం, తిరిమలాయపాలెం మండలంలో కొనసాగుతోంది.

Exit mobile version