మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిపై మండిపడ్డారు వైఎస్సార్ టీపీ నేత వైఎస్ షర్మిల. పద్మా దేవేందర్ రెడ్డి ఏమైనా చేశారా రెండు సార్లు గెలిపించారు కదా… మీకోసం ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. భార్య – భర్త అన్నింట్లో సగం సగం అంటారు. పద్మ దేవేందర్ రెడ్డి ఆ పాయింట్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. అధికారం మొత్తం భర్తనే అంట… పెత్తనం మొత్తం భర్తదే నంట కదా? ఆయనకు దోచుకోవడం పని. ఏ పనికైనా కమిషన్ అంట కదా.. కమీషన్లు లేక పోతే ఏ పని ముందుకు సాగదట కదా..
చివరికి రాష్ట్రంలో కలెక్టర్ బంగ్లాలు పూర్తి అవుతుంటే..ఇక్కడ మాత్రం పూర్తి కాలేదట కదా..ఎందుకు అంటే కమీషన్ లు ఇచ్చుకొలేక ఆ కాంట్రాక్టర్ పనులు అపేశాడట కదా.. అయ్యా నేను చావలేను అని కాంట్రాక్టర్ చేతులు ఎత్తేశాడట కదా..కొనాపూర్ సొసైటీ రైతుల సొసైటీ. ఎమ్మెల్యే భర్త ఆ సొసైటీ కి ఛైర్మన్ అంట కదా. మొత్తం తినేశాడట కదా… స్వయంగా డైరెక్టర్ లు పిర్యాదు చేశారట కదా.. హైకోర్ట్ సైతం అవినీతి జరిగింది అని చెప్పిందట కదా? అన్నారు వైఎస్ షర్మిల.
Read Also:IND Vs SA: రెండో టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. జట్టులో మార్పులు చేయని భారత్
అయినా ఎందుకు కేసు నడపలేదు…ఎందుకు జైల్లో పెట్టలేదు. ఎమ్మెల్యే భర్త కు ఒక న్యాయం.. ప్రజలకు ఒక న్యాయమా..! ఎక్కడుంది న్యాయం? ఇది తాలిబాన్ రాజ్యం.. మనం ఉంటున్నది ఆఫ్గన్ లో.. వాళ్ళు చెప్పిందే వేదం. ఎక్కడ చూసినా దొంగల రాజ్యం..దోపిడీ రాజ్యం. ఎక్కడ చూసినా మర్దర్లు… హత్యాచారాలు… చివరికి జర్నలిస్ట్ ను సైతం మాట్లాడనివ్వడం లేదు.. వీళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే ఉద్యమ ద్రోహులట. ఈ ఎమ్మెల్యే పద్మమ్మ మొన్న కేసీఅర్ ను బాగా పొగిడారు.. మహిళలను గౌరవించడం లో కేసీఅర్ ను మించిన నాయకుడు లేడట. వైఎస్సార్ ఉన్నప్పుడు మహిళలకు క్యాబినెట్ లో స్థానం ఇచ్చారు.
హోం మంత్రి గా కూడా ఒక మహిళను చేశారు. మరి కేసీఅర్ ఏం చేశాడు? చెప్పండి.. మొదటి క్యాబినెట్ లో ఒకరైన మహిళ మంత్రిగా ఉన్నారా? మరి మహిళలకు ఎలా న్యాయం చేస్తున్నాడు పద్మ గారు…ఇదే పద్మమ్మ కి మంత్రి కావాలని ఆశ ఉంది కదా.. మరి మీకు ఎందుకు మంత్రి ఇవ్వలేదు? మీకు చేతకాదు అని నా..లేక వేరే వర్గం అని నా…లేక మహిళ అనా అని ప్రశ్నించారు షర్మిల.
Read Also: Tirumala Brahmotsavarm Gaja Vahanam Live: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గజ వాహనసేవ