తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యమంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీతో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. సమస్యలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు… క్రమంగా విమర్శల వాడి పెంచుతున్నారు.. ఇప్పటికే ఇందిరా పార్క్, లోటప్‌పాండ్ లో దీక్షలు చేసిన షర్మిల.. తాజాగా ఖమ్మం వేదికగా నిరుద్యోగ దీక్ష చేశారు.. ఇక, ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా పాటించాలని వైఎస్‌ఆర్‌టీపీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.. నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష కార్యక్రమంలో భాగంగా రాబోయే మంగళవారం (27వ తేదీ) ఉమ్మడి నల్గొండ జిల్లాలో దీక్ష చేయనున్నారు.. మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలం, పుల్లెంల గ్రామంలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు.
ప్రతి మంగళవారం నిరుద్యోగవారం.. ఈసారి నల్గొండలో షర్మిల దీక్ష..

YS Sharmila