బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న ఐటీ దాడులపై వైఎస్ షర్మిలా స్పందించారు. బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడని మండిపడ్డారు. ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ము లేక అధికారాన్ని వాడుకుని కేసీఆర్ ఐటీ దాడులకు పాల్పడుతున్నాడన్నారు.
Also Read: YSRCP: జనసేనకు బిగ్‌షాక్.. వైసీపీలో చేరిన జనసేన కీలక నేతలు
ఎన్నికల్లో గెలిచే సత్తా లేక కాంగ్రెస్ నాయకులపై ఐటీ, ఈడీ సోదాలు జరిపిస్తూ కేసీఆర్‌కు మోదీ సాయం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని డ్రామాలాడినా బీఆర్ఎస్, బీజేపీ ఒకే తానుముక్కలన్న సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. గల్లీలో కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తీ నడిపే తెరచాటు రాజకీయాలకు ఈ ఎన్నికలే గుణపాఠం అవుతాయని హితవు పలికారు. సోదాల పేరుతో కాంగ్రెస్ నాయకులను, మద్దతుదారులను ఇబ్బందుల పాలు చేయడమే లక్ష్యంగా.. బీజేపీ, బీఆర్ఎస్2లు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు.
Also Read: Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్టును చూపించి ఓట్లు అడగగలరా?.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్
కాలేశ్వరంలో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డ కేసీఆర్‌పై ఎలాంటి విచారణ ఉండదు.. లిక్కర్ స్కాంలో వేలకోట్ల అవినీతి చేసిన కేసీఆర్ బిడ్డపై ఎలాంటి చర్యలు తీసుకోరు.. భూకబ్జాలతో అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డ బీఆర్ఎస్ బందిపోట్లపై ఐటీ, ఈడీ సోదాలు జరగవు అని అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్, మోదీల చీకటి ఒప్పందాలకు ఇంత కన్నా నిదర్శనం ఏముంటుంది? షర్మిలా వ్యాఖ్యానించారు. ప్రజలు అధికారం కట్టబెట్టింది సేవ చేయమని గానీ ప్రతిపక్షాలను అణగదొక్కమని కాదు.. మీ ఆటలు మరెన్నో రోజులు సాగవు.. మరికొద్ది రోజుల్లో కేసీఆర్, మోదీల పాలనకు తెలంగాణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని షర్మిలా వ్యాఖ్యానించారు.