మద్యం మత్తులో యవకులు వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. రోడ్డుపై రాష్ డ్రైవింగ్ చేస్తూ కొంతమంది అమాయకుల ప్రాణాలు హరిస్తున్నారు. మరికొందరిని ఆస్పత్రుల పాలు చేస్తున్నారు. హైదరాబాద్ కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో యువకుల వీరంగం చేశారు.
కేపీహెచ్‌బీ రోడ్డు నెంబర్ 3లో కొంతమంది యువకులు హడావిడి చేశారు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ భయబ్రాంతులకు గురి చేశారా యువకులు. అంతేకాకుండా, హాస్టల్ అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు యువకులు. స్థానికులు కారు ఆపి మద్యం మత్తులో ఉన్న యువకులకు దేహ శుద్ధి చేశారు. దీంతో మద్యం మత్తులో ఉన్న యువకులు పారిపోయారు. రాష్ డ్రైవింగ్ చేసిన కారులో కండోమ్ లు లభ్యం అయ్యాయి. కండోమ్ లతో పాటు మద్యం సీసాలు ఉన్నాయి.
అమ్మాయిలను ట్రాప్ చేసే క్రమంలో చాక్లెట్స్, ఇతర వస్తువులు సైతం కారులో లభ్యం అయ్యాయి. కారులో ఉన్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపారు. రాష్ డ్రైవింగ్ పై కారణాలు అడిగితే మద్యం మత్తులో పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు ఇద్దరు యువకులు. దీంతో వారిపై కేసు నమోదుచేశారు పోలీసులు.
