Site icon NTV Telugu

Cell Tower: మద్యం మత్తులో సెల్ టవరెక్కి….

Cell2

Cell2

ఈమధ్యకాలంలో చిన్నచిన్న సమస్యలకు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు యువత. అదే మద్యం మత్తులో అయితే వారుచేసే హడావిడి అంతా ఇంతా కాదు. తాజాగా హైదరాబాద్‌లో మద్యం మత్తులో ఒక యువకుడు చేసిన హడావిడి పోలీసులకు చెమటలు పట్టించింది. అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన నర్సింగ్ రావు మద్యం మత్తులో ఫ్లెక్సీ కోసం ఏర్పాటు చేసిన టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు.

నర్సింగ్ రావు గతంలో రెండు పర్యాయాలు టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. శనివారం అర్థరాత్రి 11 గంటల ప్రాంతంలో టవర్ ఎక్కి మరోసారి పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. సురక్షితంగా కిందకు దించి స్టేషన్ కు తరలించారు పోలీసులు. గతంలో ఉద్యోగం కావాలని భార్య తిట్టి పుట్టింటికి పోయిందంటూ టవర్ ఎక్కాడు నర్సింగ్. మద్యం మత్తులో దూకుతా అంటూ బెదిరించాడు నర్సింగ్ రావు అర్థగంట పాటు హంగామా చేశాడు. సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కిందకు దింపేందుకు నానా అగచాట్లు పడ్డారు.
Yadadri: కొండపై పార్కింగ్ ఫీజు గంటకు రూ. 500.. క్లారిటీ ఇచ్చిన ఈవో..

Exit mobile version