పాతబస్తీలో అర్ధరాత్రి ఇంటి ముందు కూర్చొని ఎందుకు లొల్లి చేస్తున్నారని ప్రశ్నించిన పాపానికి 20 మంది గ్యాంగ్ కలిసి ఓ కుటుంబంపై దాడికి పాల్పడిన సంఘటన పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి చోటుచేసుకుంది
బార్కాస్ ప్రాంతానికి చెందిన సల్మాన్ ఇంటి ముందు అర్ధరాత్రి న్యూసెన్స్ చేస్తున్న పొరుగు ఇళ్లకు చెందిన సయ్యద్ తారీఖ్ అతని బంధువులను సల్మాన్ వెళ్లిపోవాలని సూచించాడు…దీంతో రెచ్చిపోయిన వారు వెళ్లపో మ్మనడానికి నువ్వెవ్వరంటూ దూషించారు. అంతటితో ఆగకుండా కొద్ది సేపటి అనంతరం జిలానీ అండ్ గ్యాంగ్…కత్తులు, కర్రలతో దాడికి పాల్పడి హత్య చేసేందుకు యత్నించారు…ఈ ఘటనలో అద్నాన్ తో పాటు అతని కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. రెండు గ్రూపులు ఫిర్యాదు చేయడంతో 16 మంది పైన కేసులు నమోదు కాగా 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.