Airport Bawarchi Restaurant: బైక్‌ను అడ్డుకున్నందుకు ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసిన సంఘటన RGIA పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎయిర్‌పోర్ట్ బావర్చి హోటల్ ముందు జరిగింది.
బుధవారం రాత్రి శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్ బావర్చి వద్ద బైక్‌పై ముగ్గురు యువకులు బండిని ఆపారు. అటుగా వచ్చిన మరో యువకుడు బైక్ అడ్డు తొలగించాలని చెప్పడంతో వారి మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది. అక్కడే ఉన్న మరో ఇద్దరు యువకులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా యాక్టివాపై ఉన్న ఇద్దరు యువకులు సురేష్, నాయక్‌లపై కత్తితో దాడి చేయడంతో సురేష్‌కు తీవ్రగాయాలు, నాయక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి చేరుకుని దాడికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Read also: Google: గూగుల్ ప్రవేశపెట్టబోతున్న ప్రాజెక్ట్ ఆస్ట్రా అంటే ఏమిటో? తెలుసా..
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బావర్చి విమానాశ్రయం 24 గంటలు తెరిచి ఉంటుంది మరియు నిరంతరం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి ఎయిర్ పోర్ట్ బావర్చి నిర్వాహకులపై చర్యలు తీసుకుని రోడ్డుపై వాహనాలు నిలపకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. బావర్చి ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాడిలో గాయపడిన సురేష్, నాయక్‌లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దన్నారు.
Gold Price Today : నేడు పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?