Site icon NTV Telugu

Hyderabad: గంజాయి మత్తు.. యువకుల వీరంగం.. పోలీసు వాహనం ధ్వంసం

Mehendi

Mehendi

నగరంలోని మెహదీపట్నంలో యువకులు వీరంగం సృష్టించారు. సోమవారం రాత్రి గంజాయి మత్తులో ఉన్న యువకులు ఆసిఫ్‌నగర్‌లో హల్‌చల్‌ చేశారు. పోలీసు వాహనం పైకి ఎక్కి ధ్వంసం చేశారు. మరికొన్ని వాహనాలపై దాడిచేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్​ మెహిదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌లో అర్ధరాత్రి యువకులు హల్​చల్‌ చేశారు. జిర్రా సమీపంలోని రాయల్స్​ హోటల్‌ వద్ద గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగించారు. దీంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆదే సమయంలో ముఠా సభ్యులు పోలీసు వాహనమెక్కి బీభత్సం సృష్టించారు. మత్తులో ఉన్న యువకులు పోలీస్‌ వాహనంపైకి ఎక్కి నానా హంగామా చేశారు. పోలీసు వాహనంతో పాటు ఇతర వాహనాల అద్దాలు పగలగొట్టారు. స్థానికుల సహాయంతో గంజాయి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో కొందరు తప్పించుకోగా..అజయ్‌ అనే యవకుడిని అసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో నిన్న అర్ధరాత్రి చోటుచేసుకుంది. గంజాయి మత్తులో యువకులు రోడ్లపై హంగామా సృష్టించారు. అర్ధరాత్రి వాహనదారులను అడ్డుకుని వాదనకు దిగారు. ఇటీవలే చొప్పదండి పట్టణంతో పాటు వివిధ గ్రామాలు సమీప మండలాలైన రామడుగు, గంగాధర మండలాల్లో గంజాయి విక్రేతలను పోలీసులు పట్టుకున్నారు.

పోలీసుల నిఘాకు అందకుండా మరికొందరు గంజాయి విక్రేతలు సోషల్ మీడియా సందేశాలతో యువకులకు సరఫరా చేస్తున్నారనే స్థానికులు ఆరోపిస్తున్నారు. గంజాయి లభించని యువకులు కొందరు బొనొఫిక్స్ ద్రావకాన్ని తయారు చేసుకుని సేవిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు.

Bus Charges: చార్జీలు పెంచండి.. ఏపీఎస్‌ ఆర్టీసీకి టీఎస్‌ ఆర్టీసీ రిక్వెస్ట్

Exit mobile version