NTV Telugu Site icon

Couple Arrested: ఘరానా దంపతులు.. నిత్య పెళ్లికొడుకు అవతారమెత్తిన భర్తకు సపోర్టుగా భార్య

Frod Marrige

Frod Marrige

Couple Arrested: బడా వ్యాపారవేత్తగా బిల్డప్ ఇస్తూ మ్యాట్రిమోనీ వెబ్ సైట్ల ద్వారా పెళ్లికి యత్నిస్తున్న ఘరానా జంటను సీసీఎస్ స్పెషల్ జోన్ క్రైమ్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యెలిగంటి రంజిత్ అలియాస్ రాధాకృష్ణ అలియాస్ రాకేష్, సంధ్య దంపతులు. ఉప్పల్ పరిధిలోని ఫిర్జాదిగూడలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. 2022లో వారి సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తూ.. తెలుగు మ్యాట్రిమోనీ వెబ్ సైట్లను తనిఖీ చేశాడు. ఆ సమయంలో చాలా మంది యువతులు పెళ్లి కోసం మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో ప్రొఫైల్స్ అప్‌లోడ్ చేయడం గమనించాడు. దీంతో నిత్య పెళ్లి కొడుకుగా అవతారమెత్తాడు. యాప్‌లో ప్రొఫైల్‌ చూసి పెళ్లికి సిద్ధమయ్యాక.. నేను ఫలానా దగ్గర పని చేస్తున్నా.. నీ జీతం ఎంత.. నేను బిల్డర్‌ని, నా వెంచర్‌ ఓ రేంజ్ లో నడుస్తోంది.. నేను చాలా ధనవంతుడిని అంటూ యువతులను పరిచయం చేసుకున్నాడు. అతని భార్య కూడా సహకరించి పరిస్థితిని బట్టి వేషం మార్చుకుంటూ వచ్చింది.

Read also: Sharathulu Varthisthai : షరతులు వర్తిస్తాయి మూవీకి క్లీన్ యు సర్టిఫికెట్..

అతడిపై యువతులకు నమ్మకం కుదరగానే.. ఆ తర్వాత తనకు అత్యవసరంగా డబ్బులు కావాలని.. కట్నం డబ్బుల్లోంచి కట్ చేసుకోవచ్చని చెప్పి నమ్మించడం స్టార్ట్ చేస్తాడు. దీంతో ఆ తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు. అంతే వ్యవహారంలో భర్తకు భార్యకూడ తోడు ఉండటం వలన కొద్ది రోజులు వీరి భాగోతం అలా సాగింది. ఈ ఘటనపై కొందరు బాధితులు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతి నేతృత్వంలోని బృందం విచారణ చేపట్టింది. నిందితులపై గతంలోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పదుల సంఖ్యలో బాధితులు లక్షల్లో మోసపోయినట్లు విచారణలో తేలింది. షాదీ.కామ్, ఇతర మ్యాట్రిమోనియల్ సైట్‌లలో వివాహ సంబంధాల కోసం వెతుకుతున్నప్పుడు, వారి ప్రొఫైల్‌ను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ జంట ఎవరైనా మోసపోయినట్లయితే, వారు పోలీసులను సంప్రదించాలని సూచించారు.
Pratibha Patil: జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో ఇబ్బంది.. ఆస్పత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి