NTV Telugu Site icon

మహిళను వేధింపులకు గురి చేస్తున్న యువకుడు అరెస్టు

మహిళను వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటో కాల్ ( VOIP ) ద్వారా వేధిస్తున్న యువకుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు రాచకొండ సైబర్ క్రైం పోలీసులు. గత ఆరునెలలుగా మహిళ కు అసభ్యకరమైన వీడియోలు , ఫోటోస్ పంపడం, మానసికంగా వేధింపులకు గురి చేస్తూ ఉండడం జరుగుతుంది. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, హాయత్ నగర్ మండలం, మునుగు నూరు కు చెందిన చల్లా వెంకటేష్ (18) అనే యువకుడిగా నిర్దారించుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని అతని పై కేసు నమోదు చేసి , అతని వద్ద నుండి మొబైల్ ను స్వాధీనం చేసుకుని 354 D 509, ఐపీసీ సెక్షన్ 67 ఐటీ ఆక్ట్ ప్రకారం సెక్టన్ కింద నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది.

అయితే స్థానికంగా ఉండే మహిళ వద్ద మొబైల్ కొరకు 9,000/- తీసుకుని , ఆ డబ్బులను విడతాలవారిగా ఇస్తానని నమ్మబలికి , డబ్బులు ఇవ్వకపోవడం వలన బాధిత మహిళ తల్లి యువకుడిని నిలదీయగా ఇస్తాను ఇస్తాను అని నమ్మబలికి , డబ్బులు అడుతున్నారని కోపం మనసులో పెట్టుకుని , రకరకాల మొబైల్ నంబర్లతో వాట్సప్ కాల్స్ చేసి అగౌరవంగా మాట్లాడడం , అసభ్యకరమైన వీడియోస్ పంపుతూ వేధింపులకు గురిచేస్తూ ఉండడంతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు… ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం బయటికి వచ్చింది.