Site icon NTV Telugu

Fraud With Fake Accounts: పేరు మార్చి అమ్మాయిలకు గాలం.. రూ.6 కోట్లకు పంగనామం పెట్టిన కేటుగాడు

Fake Accounts

Fake Accounts

Young man Changed his name and Cheated Girls: హర్ష.. అతని ఫ్రెండ్‌షిప్ కోసం అందరూ అమ్మాయిలు ఎగపడ్డారు. హర్ష ఇన్‌స్టాగ్రామ్ లో తమను ఫాలో చేస్తున్నారంటే అదో స్టేటస్ సింబల్ గా అమ్మాయిలు భావించారు. హర్ష ఫాలోయింగ్ కోసం అందరూ ఇష్టపడ్డారు. అయితే హర్ష ఒక క్రిమినల్. వందల కొద్దీ అమ్మాయిని మోసం చేశాడు. ట్విట్టర్ ఇన్‌స్టాగ్రామ్ లో అమ్మాయిల పేరుతో నకిలీ అకౌంటు సృష్టించాడు. అంతేకాకుండా తనకు తాను నకిలీ అకౌంటుతో ఫాలోయింగ్ పెంచుకున్నాడు. దీంతో పాటుగా అమ్మాయిలకి అమ్మాయిల అకౌంట్లతో చాటింగ్ చేశాడు. ఇలా ఒక్కొక్కరిని ఒక విధంగా మోసం చేసి దాదాపు 6 కోట్ల రూపాయలను కొట్టివేశారు. అమెరికాలో ఉండే హైదరాబాద్ అమ్మాయి దగ్గరి నుంచి కూడా 25 లక్షలు కొట్టేశాడు. అయితే హర్ష అసలు పేరు వంశీకృష్ణ. అతడు ఈ విధంగా ఎలా మోసం చేశాడో పోలీసులు వివరంగా చెప్పారు.

హర్ష ఫాలో అవుతున్నాడా..? యూ ఆర్‌ సో లక్కీ.. వాడు కనీసం మా రిక్వెస్ట్‌ కూడా యాక్సెప్ట్‌ చేయడు. నీవు ఎన్‌ఆర్‌ఐవా..? అంటూ అమెరికాలో ఉంటున్న యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో ముగ్గురు యువతుల పేరుతో వంశీ సందేశాలు పెట్టాడు. వాటిని చూసిన ఆమె హర్ష అంత గొప్పవాడా? అనే భ్రమలో పడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహానికి ఒప్పుకుంది. ఇక్కడ సీన్‌ కట్‌ చేస్తే..తాను చాలా కంపెనీలకు ప్రతినిధినని.. షేర్‌ మార్కెట్‌లో తనకు రూ. 300 కోట్లకుపైగా షేర్స్‌ ఉన్నాయంటూ.. బిల్డప్‌ ఇచ్చి.. బాధితురాలి వద్ద రెండు దఫాలుగా రూ. 25 లక్షలు కాజేశాడు ఆ ఘరానా సైబర్‌ నేరగాడు. దేశవ్యాప్తంగా 70 మంది యువతులను మోసం చేసి.. సుమారు రూ. 4 కోట్లు కొల్లగొట్టాడు. చివరికి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు రాజమండ్రికి చెందిన జోగడి వంశీకృష్ణ.

Read Also: Wife Planned Husbands Murder: భార్యామణి నిర్వాకం.. భర్త అడ్డు తొలగించే ప్లాన్

బాధితురాలి ఫోన్‌ నంబర్‌ను ఇన్‌స్టా ద్వారా తెలుసుకున్న వంశీకృష్ణ.. ఆమె ఫోన్‌ చేయగానే ‘నేను బిజీగా ఉన్నాను.. తరువాత కాల్‌చేస్తానంటూ సందేశం పెట్టాడు. కొన్ని గంటల తరువాత ‘నాకు ఫోన్‌ వచ్చింది.. ఎవరంటూ మాట్లాడాడు.. వావ్‌.. నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను.. నా నంబర్‌ మీకెలా వచ్చింది’ అంటూ బిల్డప్‌ ఇచ్చాడు. ధనవంతుడిగా కలరింగ్‌ ఇవ్వడంతో బాధితురాలు కూడా నమ్మింది. కొన్నాళ్లు ఇద్దరూ చాట్‌ చేసుకోవడం, వాట్సాప్‌ కాల్స్‌ మాట్లాడుకోవడం చేశారు. ‘నేను నా సంపాదనలో 10 శాతం దాన ధర్మాలు చేస్తానం’టూ..బాధితురాలి నుంచి రూ. 5లక్షలు తీసుకున్నాడు. వారం రోజుల తరువాత అర్జెంట్‌గా రూ. 20 లక్షల లిక్విడ్‌ క్యాష్‌ కావాలని, ఆన్‌లైన్‌లో రెండు రోజుల్లో నగదు బదిలీ చేస్తానన్నాడు. దీంతో ఆమె హైదరాబాద్‌లో ఉన్న తన తండ్రికి విషయాన్ని చెప్పి ఆ మొత్తాన్ని ఇప్పించింది. వారం తరువాత డబ్బులు అడగ్గానే కేసులు పెట్టిస్తానంటూ బెదిరింపులకు దిగాడు. జరిగిన విషయాన్ని బాధితురాలు తన తండ్రికి వివరించడంతో ఆయన సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ బృందం కేసు దర్యాప్తు ప్రారంభించింది. బాధితురాలితో చాట్‌ చేసిన ఇన్‌స్టా ఐడీలన్నీ ఒకే చోట నుంచి క్రియేట్‌ అయినట్లు పోలీసులు గుర్తించారు. సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు నిందితుడిని పట్టుకొని.. పీటీ వారెంట్‌పై అరెస్ట్‌ చేశారు. విచారణలో 70 మంది వంశీకృష్ణ బాధితులునట్లు తేలింది. అతడిపై 14 కేసులు నమోదయ్యాయి.

రాజమండ్రికి చెందిన జోగడి వంశీకృష్ణ బీటెక్‌ మధ్యలోనే ఆపేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిల పేరుతో అకౌంట్స్‌ క్రియేట్‌ చేస్తాడు. ముందుగా హర్ష అనే పేరుతో ఒక ఐడీని రూపొందించాడు. బాధితురాలి ప్రొఫైల్‌ చూసి.. ఆమెను హర్ష ఐడీతో ఫాలో అయ్యాడు. ఆ మరుసటి రోజు ముగ్గురు అమ్మాయిల ఐడీలను తయారు చేసి.. ఒక్కో వాటితో ఒక్కోరోజు బాధితురాలికి సందేశాలు పెట్టాడు. ‘హర్ష మిమ్మల్ని ఫాలో అవుతున్నాడా? మీరు గ్రేట్‌’ అంటూ ఒకరు.. మరో యువతి ఐడీతో ‘నేను ఎన్నో సార్లు వాడి కోసం ప్రయత్నించినా.. నేను ఫాలో అవలన్నా కావడం లేదు.. నీవు విదేశాల్లో ఉంటావా? వ్యాపారం చేస్తావా? అతడితో నీవు సరితూగుతావని ఫాలో అవుతున్నాడేమో’ అని మరో మెస్సేజ్‌.. రెండు రోజుల తరువాత ‘వాహ్‌..నేను వాడిని ప్రేమించేందుకు ప్రయత్నించా.. వాడు కనీసం నా వైపు కూడా చూడడం లేదు.. నేను అందంగా ఉన్నానని ఫీల్‌ అవుతాను.. కానీ నీవు లక్కీ.. హర్ష నిన్ను ఫాలో కావడం’ అంటూ సందేశాలు పంపించాడు.

Exit mobile version