NTV Telugu Site icon

ఎల్బీ నగర్‌లో దారుణం.. ప్రేమించిన యువతి ఇంటికి వెళ్లి ఏకంగా 18 సార్లు..

హైదరాబాద్‌లో మరో దారుణమైన ఘటన జరిగింది.. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని.. తనతో కాకుండో మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమవుతుందంటూ ఓ యువతిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడో యువకుడు.. ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురంలో జరిగిన దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం చంద్రకల్‌కు చెందిన ఓ యువతి.. అదే ప్రాంతానికి చెందిన బస్వరాజ్‌ అనే యువకుడు గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నట్టుగా తెలుస్తోంది..

Read Also: టీడీపీ నేతలే దాడి చేశారు.. వీడియోలు కూడా ఉన్నాయి..

అయితే, గత రెండు నెలల క్రితం మరో వ్యక్తితో సదరు యువతికి పెళ్లి నిశ్చయం అయ్యింది… అప్పటి నుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువతిపై ఒత్తిడి తెచ్చాడు బస్వరాజ్.. అయితే, ఆమె పెళ్లికి నిరాకరించడంతో ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో.. ప్రస్తుతం ఆ యువతి కుటుంబం నివాసం ఉంటున్న హస్తినాపురంలోని ఇంటికి వెళ్లాడు.. కత్తితో అతి కిరాతకంగా దాడికి దిగాడు.. ఏకంగా 18 సార్లు యువతిపై కత్తితో పొడిచినట్టుగా చెబుతున్నారు.. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉండగా.. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. ఇక, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఎల్బీ నగర్‌ పోలీసులు.. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనతో కలకలం రేగింది.