ఖమ్మం జిల్లా వేంసూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ధాన్యం తడవకుండా పట్టాను కప్పుతున్న సమయంలో పిడుగు పాటుకు గురై 24 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తూ ఉండటంతో ఆరపోసిన ధాన్యం తడిసిపోతోందని ఆవేదన చెందిన యువ రైతు సాగర్.. ఆ ధాన్యం రాశి వద్దకు వెళ్లి పట్టాను కప్పు తున్న సమయంలో పిడుగు పడటం తో అక్కడికక్కడే మృతి చెందాడు. సాగర్ వేంసూర్ వెటర్నరీ హాస్పటల్ లో అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. అనుకొని రీతిలో పిడుగు పాటుకు గురై ప్రాణాలు కోల్పోవడంతో సాగర్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త తుఫాన్‌గా మారి ఏపీలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలో కూడా పలు చోట్ల ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రైతులు, కాపర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.