Yadagirigutta: యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్షేత్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఆలయాన్ని సందర్శిస్తానని చెప్పారు. నెల రోజుల్లో సమీక్షా సమావేశం నిర్వహించి గతంలో ఉన్న సంప్రదాయాన్ని క్షేత్రస్థాయిలో తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. తొలుత ఎమ్మెల్యేకు ఆలయ ఈవో రామకృష్ణారావు, ధర్మకర్త నరసింహమూర్తి స్వాగతం పలికారు. అనంతరం ఆయన దైవ దర్శనం చేసుకుని పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వందల ఏళ్లుగా ఉన్న యాదగిరి గుట్ట పేరును గత ప్రభుత్వం యాదాద్రిగా మార్చిందని అన్నారు. భద్రాచలం పేరును కూడా మార్చినట్లు చెబుతున్నారు. ఇది సంప్రదాయానికి విరుద్ధం. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ పదాలు ముఖ్యమన్నారు. 60 ఏళ్లుగా పోరాడిన తెలంగాణలో ఆంధ్రుల పేర్లు ఉండకూడదని ముఖ్యమంత్రి అన్నారని, ఇది విని నిజంగానే తన జన్మ ధన్యమైందని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. త్వరలో యాదాద్రికి యాదగిరి గుట్టగా సీఎం నామకరణం చేయనున్నట్లు తెలిపారు. పాత సంప్రదాయాలను పునరుద్ధరిస్తామని చెప్పారు. ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కొం
Read also: Director Krish: రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. పోలీసుల విచారణకు క్రిష్
డపై వసతి గృహం నిర్మించి భక్తులకు కనువిందు చేస్తామన్నారు. పది రోజుల్లో హాలును నిర్మించాలని సూచించారు. ఆలయ అర్చకులకు విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా.. యాదాద్రి పేరును చినజీయర్ స్వామి సూచించారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత యాదాద్రిని మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తారని వార్తలు వచ్చాయి. అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ క్షేత్ర పర్యటనకు వచ్చినప్పుడు యాదగిరిగుట్ట పేరుతో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలు విడుదల చేసింది. దీంతో ఆలయ పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ దానిపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. ఈ క్ర మంలోనే తెలంగాణ లో అధికార పగ్గాలు చేప ట్టిన కాంగ్రెస్ స ర్కారు కూడా ఆలేరు ఎమ్మెల్యే వ్యాఖ్య ల ద్వారా పేరు మార్చుకోవాల ని ఆలోచిస్తోంది. దీంతో మాజీ సీఎం కేసీఆర్ చేయాలనుకున్నది ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది యాదగిరిగుట్ట పేరును అలాగే ఉంచాలని కోరుతున్నారు. అయితే పేరు మార్పుపై క్లారిటీ కోసం వెయిట్ చేయాల్సిందే..
Abraham Ozler : ఓటీటీలోకి వచ్చేస్తున్న మమ్ముట్టి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ..