NTV Telugu Site icon

Minister Jagadish Reddy: వ్యవసాయ రంగంలో ఎక్కువ లాభపడింది ఆ జిల్లే..

Minister Jagadesh Reddy

Minister Jagadesh Reddy

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ విషయంపై నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసి.. రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి చెప్పుకొచ్చారు.

Also Read : Karumuri Nageswara Rao: చంద్రబాబు మేనిఫెస్టో టిష్యూ పేపర్ లాంటిది.. తుడుచుకోవటానికి తప్ప దేనికీ పనికిరాదు

రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ త‌న అద్భుత‌మైన ప‌రిపాల‌న‌తో అనేక రంగాల్లో విజయాలు సాధించిందని చెప్పుకొచ్చారు. వ్యవసాయ రంగంలో రైతాంగానికి విశ్వాసం క‌లిగించార‌ని, టీఎస్ ఐపాస్ తో రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పించామని ఆయన అన్నారు. త‌ల‌స‌రి ఆదాయంలో దేశంలో తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌గా నిలిచింద‌ని మంత్రి గుర్తు చేసుకున్నారు.

Also Read : Jharkhand: పెళ్లయిన 15రోజులకే అల్లుడిని దారుణంగా చంపిన తండ్రికొడుకులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయ రంగంలో ఎక్కువ లాభపడిన జిల్లా నల్గొండ అని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసిన ఉమ్మడి జిల్లా గత 4 ఏళ్లుగా 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసి దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగిందన్నారు. అన్ని రంగాలలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంతో ప్రగతిని సాధించడంతో పాటు ఉపాధి, ఉద్యోగం అంటూ అన్నిరంగాల్లో అభివృద్ధిలో ముందున్నాయన్నారు.

Also Read : Sharwanand: హే.. శర్వా.. నువ్వా.. పెళ్ళికి ముందే ఇలా మారిపోయావు ఏంటీ ..?

గత తొమ్మిది ఏళ్లలో సాధించిన ప్రగతిని అన్ని శాఖ‌లు నివేదికల రూపంలో తయారు చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ సమాచారం మొత్తం జూన్ 2వ తేదీ లోపు ప్రజాప్రతినిధులందరికీ సమర్పించాలన్నారు. తెలంగాణ రైతు దినోత్సవం మొదలుకొని జూన్ 22న నిర్వహించే అన్ని కార్యక్రమాలు ఘనంగా చేయాలన్నారు.