NTV Telugu Site icon

Yadagirigutta Temple: తిరుపతి తరహాలో భక్తులకు యాదాద్రిలోనూ స్వయంభువుల దర్శనం..

Ydadri Temple

Ydadri Temple

Yadagirigutta Temple: తిరుమల తిరుపతి మాదిరిగానే యాదాద్రిలో కూడా భక్తులకు స్వయంభూ దర్శనం లభించనుంది. మహాముఖ మండపంలో భక్తులు దూరం నుంచి మూలవరులను చూస్తూ గర్భాలయానికి చేరుకునేలా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. వచ్చే బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని యాదాద్రి ఈవో భాస్కర్ రావు ఈటీవీ భారత్ కు తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తులకు తీర్థంతో పాటు శఠగోపాన్ని అనుగ్రహిస్తారని వివరించారు. అందుకోసం ప్రత్యేక పూజారిని నియమిస్తామన్నారు.ఈ నెల 10వ తేదీ బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Read also: Balkampet Yellamma: రేపు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. ఆలయం వద్ద ఆంక్షలు..

ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య మాట్లాడుతూ.. స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడికి శఠగోపంతో పాటు తీర్థం ప్రసాదాలు అందిస్తామన్నారు. 14న వనమహోత్సవం పేరుతో పొలంలో రెండు వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. 15న ఉదయం 6.05 గంటలకు సామూహిక ‘గిరి ప్రదక్షిణ’ నిర్వహిస్తున్నట్లు వివరించారు. శ్రావణ మాసం మొదటి వారంలో నూతన నిత్యాన్నప్రసాద భవనాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమగోపురం నుంచి నేరుగా వికలాంగులకు దైవ దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇక నుంచి కొండ దిగువ నుంచి వచ్చే వారికి బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్ష నిర్వహించాలని ఆదేశించినట్లు ఆలయ ఈఓ తెలిపారు.
CM Revanth Reddy: నేడు ఏపీకి రేవంత్‌రెడ్డి.. ప్రత్యేక విమానంలో విజయవాడకు..