యాదాద్రి జిల్లా రామన్నపేటలో నూతనంగా నిర్మించిన సహకార సంఘం భవనాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. రైతు రుణమాఫీపై క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 9 లోపు పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 22 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేశాం.. రాష్టంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలోనే ఎక్కువ రుణమాఫీ జరిగిందని అన్నారు. దేశంలో ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని మంత్రి పేర్కొన్నారు. అలాగే.. పెండింగులో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని చెప్పారు.
Read Also: Anushka Shetty: విడాకులైన డైరెక్టర్ తో అనుష్క పెళ్లి.. అసలు నిజం ఇదే!!
రామన్నపేటను కొత్త మార్కెట్‌గా పునరుద్ధరణ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే ఏ పథకాన్ని అమలు చేయలేదు.. దీంతో సహకార సంఘాలు కోట్ల రూపాయలు నష్టపోయాయని అన్నారు. మరోవైపు.. చేనేతకు పెండింగులో ఉన్న నిధులను త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారు. చేనేత ద్వారా తెలంగాణలో ఉన్న ప్రతి మహిళలకు చీరలు ఇస్తాం.. చేనేత వృత్తి మీద బ్రతికే కుటుంబాల కోసం వాళ్ళ అప్పులను కూడా ప్రభుత్వం మాఫీ చేస్తుందని అన్నారు. మరోవైపు.. వడ్ల కొనుగోలులో మిల్లర్స్‌తో మాట్లాడి వాళ్లకు మిల్లింగ్ ఛార్జీలు పెంచామని తెలిపారు. రైతులు తేమ లేకుండా ధాన్యం, పత్తిని తీసుకురావాలి.. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.
Read Also: Kerala: మదర్సాలో ఉపాధ్యాయుడి దాష్టీకం.. విద్యార్థి ప్రైవేట్ భాగాలపై ఎర్ర కారం పూసి…