NTV Telugu Site icon

Yadadri Temple: గుట్ట మీద భక్తుల బసకు ఏర్పాటు.. దాదాపు 200 వరకు గదులు..!

Yadadri Temple

Yadadri Temple

Yadadri Temple: యాదగిరిగుట్టపై దాదాపు 200 వరకు గదులను భక్తుల బసకు ఏర్పాట్లు చేపట్టారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు వసతి పరంగా తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో.. కొత్తగా 200 గదులు నిర్మించాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. రాత్రి వేళల్లో కొండపై బస చేసి స్వామివారిని దర్శించుకునే భక్తులకు వసతి గదులు నిర్మించాలనే ప్రతిపాదనను ధార్మిక వ్యవహారాల శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అనుమతిస్తే దాతల సహకారంతో గదులు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శివాలయం వెనుక ప్రాంతంలో బాలాలయం స్థానంలో దాదాపు 200 గదులు నిర్మించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే గుట్టపై భక్తులు బస చేసేందుకు శాశ్వత ఏర్పాట్లు చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం ఈ గుట్టపై గ్రీన్ హోటల్ గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి పరిమితం కావడంతో భక్తులు కొండ కిందనే ఉండాల్సి వస్తోంది. తెల్లవారు జామున స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొనాలంటే కొండ కింద నుంచి పైకి రావాల్సిందే. అయితే ఉదయం పూట బస్సులు సమయానికి రాకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా కొండపైన పెద్ద సంఖ్యలో గదులు ఏర్పాటు చేస్తే భక్తుల కష్టాలు తీరుతాయి. భక్తుల సౌకర్యాలతో పాటు ఆలయ అభివృద్ధి పనులపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ధార్మిక శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అధికారులు సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
Atrocious: హైదరాబాద్ లో దారుణం.. ట్రావెల్ బస్సులో వివాహితపై అత్యాచారం..