NTV Telugu Site icon

Womens nude photos scam : పూజల పేరుతో మహిళల నగ్నచిత్రాలు తీసిన గ్యాంగ్.. పరారీలో నిందితుడు

Women Pic

Women Pic

పేదరికం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతలను టార్గెట్ చేసుకుని మోసగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. ఇంతకీ దందా ఏమిటంటే ముందుగా తాము ఎంచుకున్న మహిళకు మనీ ఎర చూపి మాటలు కలుపుతారు. ఎదో రకంగా ఆమెను ఒప్పుకునేలా మాయ మాటలు చెప్పి నగ్న చిత్రాలు కావాలంటారు. వాటిని హైదరాబాద్ లోని తమ గురువుకి పంపితే డబ్బులు వస్తాయంటూ నమ్మిస్తారు. పూజాకు ఎంపికైతే కోట్లు సంపాదించవచ్చు. కానీ అందుకు ఎంపిక కావాలంటే శరీరాకృతి చూపే నగ్న ఫోటోలు ఇవ్వాలి. అలా మాయ మాటలు చెప్పి సుమారు 25 మంది అమాయక మహిళల నగ్న చిత్రాలు సేకరించిన ముఠాను మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ చిత్రాలు తీశారన్న ఆరోపణలపై విచారించాగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read : Amit Shah: CISF సాధించిన విజయాలకు భారత గర్విస్తోంది

వనపర్తికి చెందిన జైనుల్లావుద్దీన్ జడ్చర్లలో అద్దెకు రూమ్ తీసుకుని ఉంటున్నారు. ఆయనతో పాటు రాములు, శంకర్ అలీ, రాములు నాయక్ కలిసి మహిళల శరీరాకృతికి సంబంధించిన నగ్ర చిత్రాలు సేకరిస్తున్నారు. నిరుపేద మహిళలకు డబ్బు ఎరగా చూపి తమకు తెలిసిన గురువు ఉన్నారని.. ఆయన పూజకు ఎంపిక చేస్తే కోట్లలో డబ్బులు వస్తాయని ఆశచూపారు. పూజకు ఎంపిక కావాలంటూ శరీరాకృతికి చెందిన నగ్న ఫొటోలు తిరుపతి అనే వ్యక్తికి పంపాలని చెప్పారు. అలా 2 నెలలుగా 20 నుంచి 25 మంది మహిళల నగ్న ఫొటోలను సేకరించి తిరుపతి అనే వ్యక్తికి ఈ నలుగురు నిందితులు పంపించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తిరుపతి అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతను పరారీలో ఉండటంతో త్వరలోనే పట్టుకుంటామని అతణ్ని విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని జడ్చర్ల పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం సంచలనం రేపుతుంది. ప్రధాన నిందితుడు తిరుపతి అరెస్ట్ అయితే గానీ ఈ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. తిరుపతి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు.

Also Read : Ukraine War: బఖ్‌ముత్‌లో మారణహోమం.. ఒక్క రోజులోనే 500 మంది రష్యా సైనికుల మరణం..