Site icon NTV Telugu

చెన్నై-బెంగళూరు హైవేను దిగ్భంధించిన మహిళా కార్మికులు

చెన్నై-బెంగళూరు హైవేను దిగ్భంధించిన మహిళా కార్మికులు దిగ్భంధించారు. ఈ ప్రాంతంలో ఉన్న ఓ స్మార్ట్‌ఫోన్‌ విడిభాగాలను అసెంబుల్‌ చేసి, తయారు చేసే కంపెనీకి చెందిన మహిళ కార్మికులు పెద్ద సంఖ్యలో శనివారం రద్దీగా ఉండే చెన్నై-బెంగళూరు హైవేను దిగ్బంధించి నిరసనకు దిగారు. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

Read Also: కేరళ పోలీసులకు సోలార్‌ గొడుగులు

తమకు క్యాంటీన్‌లో అందించిన ఆహారంలో నాణ్యత లేకపోవడం వల్ల 8 మంది ఉద్యోగులను ఆస్పత్రిలో చేర్చారని, వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి కార్మికుల నిరసన కొనసాగుతోంది. దీంతో కాంచీపురం జిల్లా సుంగువర్చతిరం వద్ద హైవేపై కార్గో ట్రక్కులతో సహా అనేక వాహనాలు నిలిచిపోయాయి. ఇప్పటికే జిల్లా అధికారులు, పోలీసు అధికారులు ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు.

Exit mobile version