Hyderabad Metro: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ఎక్కువ మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో ఫ్రీ బస్సు జర్నీ కావడంతో మహిళలు బస్సులకే ఎక్కువగా పరిమితమయ్యారు. దీంతో మెట్రో రైళ్లో ప్రయాణించే మహిళలు చాలా తగ్గారు. అయితే మహిళల కంటే పురుషులు రూ.35 తో మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇది బాధాకరమని, రాష్ట్రానికి ఆర్థిక భారం అని ఎల్.అండ్ టీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శంకర్రామన్ అన్నారు. హైదరాబాద్ మెట్రోలో రోజుకు 4.80 లక్షల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. రానున్న రోజుల్లో 10 లక్షలకు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. మెట్రో నిర్వహణకు సంబంధించి ప్రభుత్వంతో 65 ఏళ్లపాటు రాయితీ ఒప్పందం కుదుర్చుకున్నామని, 2021 నుంచి 2026 వరకు కంపెనీ పనితీరుపై సమగ్ర నివేదికను పొందుపరిచామని, వచ్చే ఐదేళ్లకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయన్నారు.
Read also: AP Elections 2024: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు
నష్టాల్లో ఉన్న ప్రాజెక్టుల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుని లాభసాటి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలన్నారు. మెట్రో ఇన్ ఫ్రా మొదటి స్థాయి అభివృద్ధి పూర్తయిందని, మరో రెండేళ్లలో మరో దశ అభివృద్ధి పనులు పూర్తవుతాయని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నారని, దీని వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని అభిప్రాయపడ్డారు. దీనిపై హైదరాబాద్ మెట్రోలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ అండ్ టీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వార్షిక నివేదిక సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు ఫిర్యాదు చేశారు. కోవిడ్ సమయంలో కూడా ఎల్.అండ్.టీ షేర్లపై శంకరమన్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును నష్టాల్లో నడుపుతున్నామని, ఆసక్తి ఉన్నవారు వస్తే కొంత వాటా ఇస్తానని అప్పట్లో ప్రకటన చేసినట్టు సమాచారం.
PM Modi : పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోడీ రోడ్‌షో.. ఊహించని విధంగా ప్రజల స్వాగతం