NTV Telugu Site icon

Free Bus Jurny: హైదరాబాద్‌లో కర్ణాటక ఆధార్ కార్డుతో ప్రయాణిస్తున్న యువతి.. వీడియో వైరల్

Free Bus Jurny

Free Bus Jurny

Free Bus Jurny: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల్లోనే రెండు కీలక హామీలను నెరవేర్చి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టింది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యానికి మహిళలు బ్రహ్మ రథం పడుతున్నారు. అందరూ ఐడీ కార్డు చూపించి జీరో టికెట్‌ తీసుకుని ప్రయాణిస్తున్నారు. ఇదే క్రమంలో కొంతమంది ఇతర రాష్ట్ర ఐడీ కార్డు లతో ప్రయాణం చేస్తూ మోసం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం లోని ఐడీ కార్డు మాత్రమే ఆధార్ తో ప్రయాణించాలి అంటున్న కండెక్టర్లకు వాదనకు దిగుతున్నారు. అక్కడ ఫ్రీనే ఇక్కడ కూడా ఫ్రీ అంటూ వారిపై సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. కండెక్టర్లు కొంచె గట్టిగా మాట్లడితే పోలీసులకు చెప్తా అంటూ విరుచుకు పడుతున్నారు. ఏంటి దబాయిస్తున్నావ్ అంటూ వారిపై ఫోన్ వీడియో తీస్తు వారినే బెదిరిస్తున్నారు. ప్రయాణికులు చెబుతున్న పట్టించుకోకుండా కండెక్టర్లపై సీరియస్ అవున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది. తాజాగా ఓ యువతి ఇన్ని రోజుల నుంచి కర్ణాటక ఆధార్ కార్డుతో ప్రయాణం చేస్తూ దొరికిపోయింది.

Read also: Chandrababu Bail: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ

బస్సులో మొబైల్ చూస్తు కండెక్టర్ మాట్లాడుతున్నా పట్టించుకోకుండా ఆ యువతి కూర్చుంది. తన దగ్గరకు వెళ్లి కండెక్టర్ మేడం టికెట్ అంటూనే తన ఆధార్ కార్డు చూపించింది. అయితే అది చూసిన కండెక్టర్ మేడం మీరు టికెట్ తీసుకోవాలి అన్నాడు. నేను ఎందుకు తీసుకోవాలి ఆధార్ కార్డు ఉంది కదా అని సమాధానం చెప్పింది. అయితే కండెక్టర్ ఇది కర్ణాటక కాదు.. తెలంగాణ మేడం అక్కడ ఆధార్ ఇక్కడ ఎలా చెల్లుతుంది ఇది కరెక్ట్ కాదు మీరు టికెట్ తీసుకోవాల్సిందే అన్నాడు. అయినా ఆ యవతి అతని మాటలు పట్టించుకోకుండా మొబైల్ చూస్తూ వాదిస్తూ కూర్చుంది. ఎంత చెప్పిన ఆ యువతి పట్టించుకోకుండా కూర్చోవడంతో.. కండెక్టర్ మేడం ఇది కరెక్ట్ కాదు.. మళ్లీ మాకు ప్రాబ్లం అవుతుంది.. ప్లీస్ టెకెట్ తీసుకోండి అన్నాడు. దీంతో రివర్స్ గా యువతి కండక్టర్ పై సీరియస్ అయింది. తన వద్ద హైదరాబాద్ ఐడీ కార్డు ఉందని చెప్పేందుకు ప్రయత్నించగా.. తోటి ప్రయాణికులు కూడా ఆ కార్డును దాచిపెట్టారని అడగడంతో చూపించలేదని వాదించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Andrapradesh : జైలు బయట తల్లి కోసం వెక్కి వెక్కి ఏడ్చిన చిన్నారి.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

Show comments