Pet Dog Bite: కుక్కకాటును నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. తనను కరిచింది పెంపుడు కుక్క కదా అని నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో చోటుచేసుకుంది.
ఎలగందుల రాజు, జ్యోతి దంపతులు ఆలేరుకు చెందినవారు. తమ ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారు. అయితే రెండు నెలల కిందటే తన పెంపుడు కుక్క జ్యోతిని కరిచింది. అయితే కుక్క కాటును పట్టించుకోలేదు. వీధి కుక్క అయితే భయపడచ్చుకానీ.. మన కుక్కే కదా అంటూ నిర్లక్ష్యం చేసింది. ఆమె నిర్లక్ష్యం ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది. గత కొద్దిరోజులుగా జ్యోతి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో కుక్కలా ప్రవర్తిస్తూ అరవడం మొదలుపెట్టింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆదివారం (జూలై 9) ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు.
Read also: Rahul Gandhi: కొత్త ఇంటికి మారనున్న రాహుల్ గాంధీ..! ఇల్లు, ఆఫీస్ ఒకే దగ్గర..
సోమవారం ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి మృతి చెందింది. జ్యోతికి ఇద్దరు కుమారులు, భర్త ఉండగా.. ఇంటి కుక్క పట్టించుకోకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో బాధిత కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కక్కు కాట్లను నిర్లక్ష్యం చేయడం సరికాదంటున్నారు వైద్యులు. వీధికుక్కలు, పెంపుడు కుక్కలు కాటేస్తే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. కుక్క కరిచినప్పుడు, వెంటనే వైద్య సహాయం తీసుకోండి. గాయాలు తగ్గి పూర్తిగా మాయమయ్యే వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కుక్క కాటుకు గురైన వ్యక్తులు వెంటనే నీరు లేదా మద్యంతో కాటు వేసిన ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రవంలో ఒకటి లేదా రెండు చుక్కలు సిఫార్సు చేయబడ్డాయి. ఆ తర్వాత సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని చెబుతున్నారు. లోతైన గాయాలను నిర్లక్ష్యం చేస్తే ఇతర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అంటున్నారు. ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Burns: కాలిన గాయాలను వెంటనే తగ్గించే సూపర్ చిట్కాలు..