NTV Telugu Site icon

Vijayashanti: ఈరోజే బీజేపీ లిస్టు.. రాములమ్మ పేరు ఉంటుందా..?

Vijayashanthi

Vijayashanthi

Vijayashanti: సినిమాల్లో లాగా రాజకీయాల్లో ద్విపాత్రాభినయం చేయకూడదు.. ఒక్క పార్టీ కోసమే పనిచేయాలి.. ఇది ఎవరి మాటలు కాదు.. మన రాములమ్మ చెప్పిన సత్యం. మరి ఈ మాటల వెనుక రహస్యం ఏంటని ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో గళం విప్పిన విజయశాంతి ఎక్కువగా సోషల్ మీడియా వేదికలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో విజయశాంతిపై ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘బీఆర్ఎస్ దుర్మార్గాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు, బీజేపీ వైపు నిలబడాలని ఇంకొందరు అంటున్నారు అంటూ విజయశాంతి చేసిన ట్విట్ ఇప్పుడు చర్చకు దారితీసింది. రెండు అభిప్రాయాలు మన తెలంగాణ మేలు కోసమే. అయితే పోలీసు లాకప్, రౌడీ దర్బార్, నాయుడమ్మ లాంటి సినిమా తరహాలో ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాల్లో సాధ్యపడదు. ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పని చేయగలం. హర హర మహాదేవ, జై శ్రీరామ్, జై తెలంగాణ’ అని విజయశాంతి తన ఎక్స్‌లో పేర్కొన్నారు.

అయితే విజయశాంతి మాటల వెనుక అసలు రహస్యం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న రాములమ్మ రాష్ట్ర నాయకత్వంపై కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ ఇప్పటివరకు విడుదల చేసిన జాబితాలో రాములమ్మ పేరు లేదు. ఇటీవల మోదీ రాష్ట్రానికి వచ్చిన సమావేశాలకు ఆమె హాజరుకాకపోవడం గమనార్హం. ఒకవేళ కట్ చేస్తే..అధికారం ఆదేశిస్తే.. కేసీఆర్ పై కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని ఆయన ప్రకటన కూడా ఇచ్చారు.. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ విడుదల చేసే తుది జాబితాలో ఆయన పేరు ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. అంతా ఓకే అయితే.. కాకపోతే.. కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు బలంగా ఉన్నాయని బీజేపీ పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇవాల్టి జాబితాలో పేరు ఉంటుందా.. లేదా..!? చూద్దాం..
Balaiah: తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం… ప్రముఖ నటుడు జూనియర్ బాలయ్య మృతి

Show comments