NTV Telugu Site icon

CM Revanth Reddy: రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం.. కేసీఆర్‌ హాజరవుతారా?

Kcr Revanthreddy

Kcr Revanthreddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారానికి సమయం ఫిక్స్ చేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని విపక్ష నేతలందరికీ ఆహ్వానం అందింది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానాలు పంపారు. అయితే.. నిన్నటి వరకు రెండు సార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్ నేటి ప్రతిపక్ష నేత, మాజీ సీఎంగా, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరువుతారా అనే విషయం ఆశక్తి కరంగా మారింది. తెలంగాణ రాష్ట్రానికి కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి.. ఆయన నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి బీఆర్ఎస్ తరపున ఎవరు హాజరవుతారనేది చర్చనీయాంశంగా మారింది.

Read also: Viral Video: వామ్మో.. ఆ ఊపుడేంది తాత.. పెళ్లిలో డ్యాన్స్ ఇరగదీసిండు..

కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్షంగా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ హాజరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. బుధవారం సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్‌ పర్యటించారు. వీరిద్దరూ గురువారం ఎక్కడ ఉంటారన్నది ఇంకా పార్టీ వర్గాలు వెల్లడించలేదు. రాజకీయాల్లో ప్రతిపక్షాలు, అధికార పార్టీలు ఎంతగా విబేధించినా.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి హాజరు కావడం ప్రోటోకాల్. అయితే కాంగ్రెస్ పార్టీపైనా, పీసీసీ చీప్ పైనా కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిగత ఆరోపణలు చేశారు. వీరితోపాటు టీఆర్‌ఎస్‌ తరఫున ప్రజాప్రతినిధులు హాజరుకాకపోవచ్చని సమాచారం.
Chief Minister Revanth Reddy Live Updates: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం లైవ్ అప్డేట్స్