Site icon NTV Telugu

Wife Kills Husband: ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య.. మూణ్నెళ్ల తర్వాత…

Wife Kil By Husband

Wife Kil By Husband

Wife Kills Husband: హైదరాబాద్ లోని ఎల్లారెడ్డిగూడలో ప్రియుడి మోజులో పడ్డ భార్య.. కట్టుకున్న భర్తనే కడతేర్చింది. పైగా, గుండెపోటుతో చనిపోయాడని డ్రామా ఆడి, అనుమానం రాకుండా దహన సంస్కారాలు పూర్తి చేసింది. మూడు నెలల కిందట జరిగిన ఈ దారుణ ఘటన.. నిందితుడు తనంతట తానుగా పోలీసుల ఎదుట లొంగిపోవటంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read also: Telangana: అలర్ట్‌.. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఎక్కడ కనిపించినా సీజ్

ఎల్లారెడ్డిగూడ జయప్రకాశనగర్ లోని శిఖర అపార్డ్ మెంట్స్లో నివాసం ఉండే సీసీ కెమెరా టెక్నీషియన్ విజయ్కుమార్ కు భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. బోరబండకు చెందిన రాజేశ్ తో శ్రీలక్ష్మి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. అయితే వీరిద్దరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన శ్రీలక్ష్మి.. చంపించాలని ప్లాన్ వేసింది. భర్త పేరిట మేడ్చల్, ఎల్లారెడ్డిగూడలో సొంత ఇండ్లు ఉన్నాయి. భర్తను చంపించి, ఆస్తి అమ్ముకొని ఆ డబ్బుతో ఎంజాయ్ చేద్దామని అనుకుంది. ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న ఇల్లు వాస్తు బాగో లేదని చెప్పి భార్య శిఖర అపార్టమెంట్ లో మకాం మార్పించి కుట్రకు ప్లాన్ చేశారు. వీరామారావునగర్ కు చెందిన పటోళ్ల రాజేశ్వర్ రెడ్డి, ఎండీ మెహ్రాబ్ అలియాస్ బబ్బన్ను రాజేశ్ సంప్రదించి సుపారీ ఇచ్చాడు. గత ఫిబ్రవరి 1న ఉదయం పిల్లలిద్దర్ని స్కూల్లో దిగబెట్టేందుకు భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లగానే, రాజేశ్వర్రెడ్డి, బబ్బన్ను శ్రీలక్ష్మి ఇంటికి పిలిపించి బాత్రూంలో దాచిపెట్టింది. భర్త ఇంటికి రాగానే తలుపులు మూసేసి బాత్రూం గడియ తీయటంతో వారంతా బయటకు వచ్చారు.

Read also: Telangana Rains: రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన.. దిక్కుతోచని స్థితిలో రైతన్న

విజయకుమార్ తలపై డంబెల్స్ తో కొట్టడంతో విజయకుమార్ కిందికి పడిపోయాడు. అంతటితో ఆగని దుండగులు విజయకుమార్ గొంతు నులిమి చంపి, బాత్రూంలో పడేసి ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాత్రూంకి వెళ్లిన భర్తకు గుండెపోటు వచ్చి, గోడ తలకు తగిలి చనిపోయాడని నమ్మించింది బంధువులను పిలిపించి శ్రీనగర్ కాలనీలోని శ్మశాన వాటికలో అదే రోజు దహన సంస్కారాలు పూర్తి చేసింది. మృతుడి కుటుంబంలో చనిపోయినవారిని పూడ్చిపెట్టి అంత్యక్రియలు చేయాల్సి ఉండగా, విజయ్ మృతదేహాన్ని మాత్రం దహన సంస్కరాలు చేయటాన్ని బట్టి పథకంలో భాగంగానే ఆధారాలు చిక్కకుండా చేసినట్టు తెలుస్తున్నది.

కాగా, విజయ్ గుండెపోటు మరణం కాదని, తామే హత్య చేశామని, హత్య చేసినప్పటి నుంచి తనకు మనఃశాంతి లేకుండా పోయిందని, అందుకే నేరాన్ని అంగీకరిస్తున్నానని రాజేశ్వర్రెడ్డి మంగళవారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడు ఇచ్చిన సమాచారంతో శ్రీలక్ష్మి, రాజేశ్, బబ్బన్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. హత్య కేసుతో పాటు సాక్ష్యాలు లేకుండా చేసినందుకు సెక్షన్లు 302, 201 కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు. అయితే, సుపారీ పంపకాల్లో తేడాలు వచ్చాయా? అన్నది ప్రశ్నగా మారింది. ఇదిలా ఉండగా, తండ్రి హత్య..తల్లి జైలు పాలు కావటంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు.
TS TET Hall Ticket: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల..

Exit mobile version