Site icon NTV Telugu

Illegal Affair : ప్రియుడి మోజులో.. కట్టుకున్నోడిని కడతేర్చిన భార్య..

crime news

crime news

రోజురోజు బంధాలు, బాంధవ్వాలంటే ఎవ్వరికీ లెక్కలేకుండా పోతోంది. నిండినూరేళ్లు కట్టుకున్న వాడితో ఉంటానని ప్రమాణం చేసిన ఓ భార్య.. వివాహేతర సంబంధం మోజు పడి.. భర్తనే కాటికి పంపింది. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం పగిడిమర్రి గ్రామంలో గత నెల 22న యూనుస్ (34) అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే.. యూనుస్ తండ్రి ఇమాసాబ్‌ కొడుకు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు.

అయితే.. అనుమానం వచ్చి భార్య ఫరజాణ బేగం (26)ను విచారించగా.. అసలు విషయం బయట పడింది. తను కొనసాగిస్తున్న అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని, ప్రియుడు అరఫత్ (28) తో కలిసి ఫరజాణ బేగం తన భర్త యూనుస్ గొంతుకు చున్నీతో చుట్టి.. శ్వాస తీసుకోకుండా ముఖంపై దిండు పెట్టి నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో నిందితులను రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

Exit mobile version