Marriage: భర్తకు మరో యువతితో పెళ్లి చేసింది కానీ.. ట్విస్ట్ మామూలుగా ఇవ్వలేదుగా మేడం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage: స్త్రీ ఏదైనా పంచుకోవడానికి ఇష్టపడుతుంది, తన భర్తను పంచుకోవడానికి ఇష్టపడదు. అంతెందుకు.. ఏ పరాయి స్త్రీ అయినా తన భర్త వైపు చూస్తే ఊరుకోదు. భర్త ఎవరితోనైనా క్లోజ్ గామాట్లాడినా తట్టుకోలేదు. అలాంటిది ఓ మహిళ… తనలో సభభాగమైన భర్తను ఎంతో ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసింది. అయితే లాస్ట్ లో ఓ ట్విస్ట్ కూడా ఉందండోయ్. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది. సింగాడి కుంట బస్తీకి చెందిన యువతి(20) నగరంలో హోం ట్యూటర్‌గా పనిచేస్తోంది. 2020లో యూసుఫ్‌గూడలోని ఓ డ్యాన్స్ అకాడమీలో శిక్షణ తీసుకోవడానికి వెళ్లినప్పుడు గాంధీ(23) అనే యువకుడిని కలిసింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరుపక్షాల పెద్దలను ఒప్పించి వారి అంగీకారంతో నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. ఆ తర్వాత యువతి, గాంధీ కొద్దిరోజులు సహజీవనం చేశారు. అయితే అంతకు ముందు రోజా అనే అమ్మాయిని గాంధీ ప్రేమిస్తున్నాడని యువతి అనుమానించింది.
Read also: Rental Houses: హైదరాబాద్‌లో అద్దె ఇండ్లకు ఫుల్ డిమాండ్.. ఓఆర్ఆర్ దాటి వెళ్ళాల్సిందే..
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఆ తర్వాత పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. రోజాను స్టేషన్‌కు పిలిచారు. గాంధీ, తాను మంచి స్నేహితులమని, తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని రోజా పోలీసులకు తెలిపారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరింది. గాంధీకి, యువతికి మే 14న వివాహం చేయాలని నిర్ణయించారు. గాంధీ తన స్నేహితురాలిగా చెప్పుకునే రోజా నుంచి అన్ని బాధ్యతలు తీసుకుని యువతులను పెళ్లి చేసుకున్నారు. కొత్తగా పెళ్లయిన జంట కొన్నాళ్లు సంతోషంగానే ఉన్నారు. అయితే.. కొద్దిరోజుల తర్వాత గాంధీ ఇంటికి ఆలస్యంగా వస్తున్నారు. ప్రశ్నించడంతో వివాహిత యువతిని కొట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే గాంధీ, రోజా కొద్ది రోజుల ముందు రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం యువతికి తెలిసింది. పెళ్లి విషయాన్ని దాచి తనకు రోజాను పెళ్లి చేసినట్లు బాధితురాలు ఆవేదనకు గురైంది.
కాగా.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని తన ఇంట్లో బాధితురాలు వేదనతో ఉండగా.. రోజా అక్కడికి వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ స్నేహితులు సుజీ, సంజీవ్, విజయ్, అనంత, జెస్సికాతో గొడవకు దిగింది. ఆ సమయంలో గాంధీ ఇంట్లో లేడు. దీంతో బాధిత యువతి రోజా, గాంధీలపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గాంధీ, రోజాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోజాతో ముందే పెళ్లైన గాంధీని మళ్లీ మరొక అమ్మాయితో ఎందుకు పెళ్ళి చేసింది అనేది ఇప్పటి వరకు గుట్టు విప్పలేదు. అయితే బాధిత యువతి మాత్రం వీరిద్దరు స్నేహితులు అంటూ ముందే పెళ్లి చేసుకుని ఏమీ ఎరగనట్టు నటించి నాతో పెళ్లి చేశారంటూ వాపోయింది. మొదటి భార్యను తన ముందే పెట్టుకుని మళ్లీ తనని పెళ్లి చేసుకున్న గాంధీని కఠినంగా శిక్షించాలంటూ కోరింది. అయితే ఇన్ని రోజులు రాజా కూడా పెళ్ళి విషయం ఎందుకు దాచి పెట్టింది? తనతో ఎందుకు మళ్లీ తన భర్తను ఇచ్చి పెళ్లి చేసింది అనేది ప్రశ్నగా మారింది. ఇది డబ్బుకోసమా? లేక పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇలా ఇద్దరు ప్రవర్తించారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే రోజా ఏమో మొదటి భార్య అయ్యింది. అందరి ముందు తాళి కట్టించుకున్న యువతి రెండో భార్య అయ్యింది. కాగా.. రెండో భార్య పెట్టిన కేసు చెల్లదంటూ పోలీసులు చెబుతున్నారు. అయితే రోజా, గాంధీ పై బాధిత యువతి పెట్టిన కేసుపై అధికారులు మాత్రం దర్యాప్తు అయితే చేస్తున్నారు.
Raviteja: సోషల్ మీడియాని వణికిస్తున్న టైగర్
తాజావార్తలు
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!