Site icon NTV Telugu

Sunitha Rao: తప్పుచేసింది వారు.. సోనియా గాంధీ ఎందుకు క్షమాపణ చెప్పాలి..?

Sunitha Rao

Sunitha Rao

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్నిగా అభివర్ణిస్తూ కాంగ్రెస్‌ నేత, లోక్‌ సభ లో ప్రతిపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు భగ్గుమన్నారు. సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ.. సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ మాటలకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతా రావు స్పందించారు. ఒకరు తప్పు చేస్తే వేరొకరు క్షమాపనలు చెప్పాలా అంటూ బీజేపీ పై విరుచుకుపడ్డారు. సోనియా గాంధీ నీ కించపరిచేలా వ్యవహరించారని మండిపడ్డారు. రాష్ట్రపతినీ కించపరచడాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా సమర్థించదు.. అంటూ స్పష్టం చేసారు. కాంగ్రెస్ మతతత్వ రాజకీయాలు చేయదని ఆమె అన్నారు. బీజేపీ నేతలు నేరాల్లో ముందు వరసలో ఉందని విమర్శించారు.

read also: Srisailam Sravanamasam: నేటినుంచి ఆగష్టు 28 వరకు శ్రావణ మాసోత్సవాలు

మహిళలకు విరోధి అని కాంగ్రెస్ పార్టీనీ చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. స్ముతి ఇరానీ ప్రవర్తన మానుకోక పోతే భవిష్యత్లో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరో చేసిన తప్పుకు సోనియా గాంధీ ఎందుకు క్షమాపణ చెప్పలని ప్రశ్నించారు. మీడియాకు తప్పు జరిగిందని చెప్పిన.. ప్లే చేశారని విమర్శించారు. నోరు జారి తప్పుగా చెప్పవచ్చు అంటూ పేర్కొన్నారు. సోనియా గాంధీ నీ టార్గెట్ చేసి క్షమాపణలు చెప్పాలి అనడం తప్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. తల్లి బిడ్డకు గోవాలో ఫేక్ లైసెన్స్ తో బార్ నడుపుతున్నారని విమర్శించారు. రాష్ట్రపతి మీద మాకు చాలా గౌరవం ఉందని, ఇలాగే ప్రవర్తిస్తే.. స్మూతీ ఇరానీ దిష్టి బొమ్మ దహనం చేస్తామని హెచ్చారించారు. 33 జిల్లాలో నిరసనలు జరుగుతాయని సవాల్‌ చేసారు. బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఎందుకు నిరసనలు చేయరని ప్రశ్నించారు. తమిళనాడు లో బెటి బచావో బెటీ పటావో అన్నందుకు ప్రధాని క్షమాపణ చెప్పలని ఆమె డిమాండ్‌ చేసారు.

Somu Veerraju: ఏపీ పరిస్థితి బాగుంటే అప్పుల కోసం ఎందుకు పరిగెడుతున్నారు?

Exit mobile version