What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today 1280

Whats Today 1280

1. నేడు ఏలూరులో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన గణపవరంలో ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

2. నేడు ఢిల్లీలో ఎస్‌సీవో భేటీలో పాల్గొనేందుకు భారత్‌కు పాక్‌ బృందం రానుంది. నేటి నుంచి ఈ నెల 19 వరకు ఎస్‌సీవో సమావేశం జరుగనుంది.

3. నేడు కాకినాడలో ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు బీజేపీ జల్లా నేతలతో సమావేశం కానున్నారు.

4. నేడు ఐపీఎల్‌ సీజన్‌ 2022లో పంజాబ్‌ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది. ఈ రోజు రాత్రి ముంబాయిలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా పంజాబ్‌, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి.

5. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,450లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,250లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 63,700లుగా ఉంది.