What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

1. నేడు ఆత్మకూరు ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలిన జరుగనుంది. అయితే ఇప్పటికే వైసీపీ, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లను వేయగా.. టీడీపీ మాత్రం పోటీకి దూరంగా ఉంది.

2. నేడు సాయంత్రానికి ఏపీకీ నైరుతి రుతుపవనాలు రానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉపరిత ద్రోణి కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

3. నేడు రాజమండ్రిలో బీజేపీ గోదావరి గర్జన సభ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11.30 గంటలకు విజయవాడ నుంచి జేపీ నడ్డా బయలు దేరనున్నారు.

4. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,200 ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 68,500లుగా ఉంది.

5. నేడు గుంటూరు, పల్నాడు జిల్లాలో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటించనున్నారు.