* నేడు ఉదయం 11 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్.. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్..
* నేడు హన్మకొండ, ములుగు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు.. తుఫాన్ కారణంగా ప్రజలు బయటకు రావొద్దని అధికారుల సూచన..
* నేడు ఢిల్లీలో జరగనున్న భారత్ రైస్ కాన్ఫరెన్స్.. భారత్ రైస్ కాన్ఫరేన్స్ లో పాల్గొననున్న తెలంగాణ పౌరసరఫరాల శాఖ.. ఎగుమతుల దిశగా తెలంగాణ బియ్యం.. కాన్ఫరెన్స్ లో తెలంగాణ ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు..
* నేడు తెలంగాణలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు.. ఫలితాలను వెబ్ సైట్ లో ఉంచనున్న అధికారులు..
* నేడు కృష్ణా జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. అవనిగడ్డ నియోజక వర్గం కోడూరులో పర్యటించనున్న పవన్.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న పవన్ కళ్యాణ్..
* నేడు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో-ఆర్డి నేటర్లు, జిల్లా అధ్యక్షులతో మాజీ సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్.. మొంథా తుఫాను తర్వాత జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం వంటి వివరాలను పార్టీ నేతలను అడిగి తెలుసుకోనున్న జగన్.. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్న జగన్..
* నేడు కాకినాడలో పర్యటించనున్న మంత్రి నారాయణ.. తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి..
* నేడు స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్, నెట్ వర్క్ ఆస్పత్రులతో ప్రభుత్వం చర్చలు.. ఉదయం 11 గంటలకి ఎన్టీఆర్ వైద్యసేవా ట్రసు కార్యాలయంలో చర్చలు.. ఇన్సూరెన్స్ విధానంలో ఎన్టీఆర్ వైద్య సేవలను అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం..
* నేడు విశాఖలోని స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లకు సెలవు.. భారీ వర్షాలు, ఈదురు గాలులతో హాలిడే ప్రకటించిన కలెక్టర్.. ఆదేశాలు ఉల్లంఘిస్తే విద్యాసంస్థల పర్మిషన్లు పునః సమీక్షిస్తామని హెచ్చరిక జారీ..
* నేడు తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం..
* నేడు బీహార్ లో ప్రధాని మోడీ, అమిత్ షా, నితిన్ గడ్కరీల ఎన్నికల ప్రచారం.. మోతీపూర్, ఛాప్రా బహిరంగ సభల్లో పాల్గొంటున్న ప్రధాని మోడీ..
* నేడు బీహార్ లోని పలు ప్రాంతాల్లో బీజేపీ అగ్రశ్రేణి నాయకుల విస్తృత ప్రచారం.. రాజకీయ దిగ్గజాల వరుస సభలతో హోరెత్తనున్న బీజేపీ ఎన్నికల ప్రచారం..
* నేడు మహిళల వరల్డ్ కప్ లో రెండో సెమీస్ లో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్.. మధ్యాహ్నం 3 గంటలకి ముంబై వేదికగా మ్యాచ్..
