* నేడు ఇందిరా భవన్ లో సీడబ్ల్యూసీ కీలక సమావేశం.. వీబీ–జీ రామ్ జీ చట్టంలోని మౌలిక లోపాలపై చర్చ.. సమావేశానికి హాజరుకానున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కొత్త ఉపాధి హామి చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళన సిద్ధమవుతున్న కాంగ్రెస్..
* నేడు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు..
* నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన.. కొత్త సర్పంచులకు సన్మానం చేయనున్న మంత్రి పొన్నం..
* నేడు మహబూబాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటన.. కొత్త సర్పంచులు, ఉప సర్పంచులను కలవనున్న కేటీఆర్.. మహబూబాబాద్ పీఎస్ఆర్ కన్వెన్షన్ లో కార్యక్రమం..
* నేడు తిరుపతిలోని జూ పార్క్ రోడ్డులో ఒబెరాయ్ హోటల్ కు టీటీడీ కేటాయించిన భూములను పరిశీలించనున్న సీపీఐ నారాయణ..
* నేడు మహిళా కమిషన్ తో ఆయేషా మీరా తల్లిదండ్రుల భేటీ.. న్యాయ పోరాటంపై కీలక ప్రకటన చేసే అవకాశం.. సీబీఐ రిపోర్టు ప్రకారం వివరాలు వెల్లడించనున్న ఆయేషా పేరెంట్స్..
* నేడు తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.. ఆదిలాబాద్, కొమురం భీం, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, కామారెడ్డిలరి ఆరెంజ్ అలర్ట్.. కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కవగా నమోదయ్యే ఛాన్స్.. రాత్రి సాధారణం కంటే 3 డిగ్రీలు తగ్గనున్న ఉష్ణోగ్రతలు..
* నేడు భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా బలరామకృష్ణ అవతారంలో దర్శనమివ్వనున్న రామచంద్ర స్వామి
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం..
* నేడు ఢిల్లీలో రెండో రోజు సీఎస్ ల 5వ జాతీయ సదస్సు.. సీఎస్ లను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశం..
