* నేడు అమరావతిలో సీజేఐ బీఆర్ గవాయ్ పర్యటన.. రాజ్యాంగ పరిరక్షణ వేడుకల్లో పాల్గొననున్న గవాయ్, సీఎం చంద్రబాబు..
* నేడు రెండో రోజు హిందూపురంలోని సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న హిందూపురం ఎమ్మెల్యే..
* నేడు సీపీఐ ఏపీ జనరల్ బాడీ సమావేశం.. ఉదయం 11 గంటలకు విజయవాడలోని దాసరి భవన్ లో మీటింగ్.. హాజరు కానున్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ కార్యదర్శులు కె. రామకృష్ణ, పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య.. పార్టీ బలోపేతం,రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ..
* నేడు పాడేరులో ఒడిశా సీఎం మోహన్ చరణ్ పర్యటన.. బిర్సా మొండా జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ సభ.. బిర్సా మొండా విగ్రహావిష్కరణకు హాజరుకానున్న సీఎం మోహన్ చరణ్..
* నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన.. వేర్వేరుగా అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు..
* నేడు పార్టీ ఫిరాయించిన మరో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ.. ఉదయం 11 గంటలకు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధ్యాహ్నం 12గంటలకి అరికపూడి గాంధీ కేసులో విచారణ.. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి.. ఇప్పటికీ అఫిడవిట్లు దాఖలు చేయని దానం, కడియం..
* నేడు తెలంగాణ వ్యాప్తంగా బీసీల న్యాయసాధన దీక్షలు.. ధర్నాచౌక్ లో ఉదయం 10. 30 గంటలకు బీసీల న్యాయసాధన దీక్ష.. బీసీల న్యాయసాధన దీక్షలో పాల్గొననున్న ఆర్. కృష్ణయ్య..
* నేడు తిరుమలలో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఉదయం ఆలయంలో లక్ష కుంకుమార్చన, రేపు ఉత్సవాలకు ధ్వజారోహణం.. పది రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు..
