NTV Telugu Site icon

K.Lakshman: తెలుగు తేజాలకు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ రావడం సంతోషం

K.lakshman

K.lakshman

K.lakshman: తెలుగు తేజా లకు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ రావడం సంతోషంగా ఉందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.
గణతంత్ర దినోత్సవ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేసారు. మోడీ భవిష్యత్ తరాల కోసం పనిచేస్తున్నారు తప్ప భవిష్యత్ ఎన్నికల కోసం కాదన్నారు. సిఫార్సులు లేకుండా మోడీ అవార్డులు ఇస్తున్నారు.. రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. పేదలను గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ABVP విద్యార్థిని పట్ల పోలీసులు అనుసరించిన తీరు దురదృష్టకరమన్నారు. BRS ప్రభుత్వం మాదిరిగానే రేవంత్ పాలన సాగుతోందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ సీట్లను గెలిపించాలన్నారు. కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అవినీతి లేని పాలన మోడీ అందిస్తున్నారని తెలిపారు. 32 లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేదల ఖాతాల్లో చేరాయన్నారు. కాంగ్రెస్ హయాంలో ఢిల్లీ నుంచి వంద రూపాయిలు పంపితే 85 రూపాయలు దళారులు తిని 15 రూపాయలు మాత్రమే పేదలకు చేరిందని స్వయంగా ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ చెప్పారన్నారు.

Read also: Raviteja: పోస్టర్ అదిరింది మావా… బచ్చన్ సాబ్ మస్త్ ఉన్నాడు

మోడీ పాలనలో దళారుల బెడద లేదన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లౌకికవాదం గా కాంగ్రెస్ భావిస్తుందన్నారు. సోమనాథ ఆలయం నిర్మాణం చేపడితే ఆనాడు నెహ్రూ తిరస్కరించారు.. నేడు అయోధ్యలో రామాలయం ప్రారంభాన్ని రాహుల్ గాంధీ తిరస్కరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలే తిరస్కరిస్తారని తెలిపారు. అంబేడ్కర్ ను నాడు ఒడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు తేజా లకు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ రావడం సంతోషమన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మదర్ ఆఫ్ డెమోక్రసీ గా భారత దేశం పేరు సాధించిందన్నారు. డా.అంబేడ్కర్ ఆశయ సాధనకు మోడీ కృషి చేస్తున్నారన్నారు. డా.అంబేడ్కర్ జన్మస్థలం.. మహూ నుంచి మొదలుకొని ఆయన పెరిగిన ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దారని అన్నారు. రాజ్యాంగ బద్దంగా మోడీ పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఓ వైపు కరోనా.. మరోవైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సాగుతున్నా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా మోడీ చర్యలు తీసుకున్నారు.
Raviteja: పోస్టర్ అదిరింది మావా… బచ్చన్ సాబ్ మస్త్ ఉన్నాడు